Published On:

Revanth Reddy: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశం

Revanth Reddy: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదేశం

CM Revanth Reddy: సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో పేలుడు ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.

 

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో 8 మంది కార్మికులు దుర్మరణం చెందారు. ఘటనాస్థలంలో ఐదుగురు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతిచెందారు.పేలుడు ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోయింది. మరో భవనానికి బీటలు వచ్చాయి.

 

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేసీఆర్ దిగ్భ్రాంతి..
పాశమైలారం ఘటనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. బాధితులకు కేంద్రం అండగా ఉంటుందన్నారు.

 

పేలుడు ఘటనపై మాజీ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిగాచి పరిశ్రమలో ఎనిమిది మంది కార్మికుల మృతిపట్ల సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి: