Ambati Rayudu: మాజీ క్రికెటర్ అంబటి రాయుడుకి నిరసన సెగ.. ఎక్కడో తెలుసా?
మాజీ క్రికెటర్ అంబటి రాయుడుకి నిరసన సెగ తగిలింది. వెలగపూడిలో అంబటి రాయుడు కాన్వాయ్‌ను అమరావతి రాజధాని రైతులు అడ్డుకున్నారు. అమరావతి రాజధానికి మద్దతు తెలపాలని కోరారు. అయితే.. అది తన పరిధి కాదని అంబటి రాయుడు తెలిపారు. దీనితో రాజధాని రైతులు నిరసన వ్యక్తం చేశారు. జై అమరావతి.. జైజై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేశారు.
Ambati Rayudu: మాజీ క్రికెటర్ అంబటి రాయుడుకి నిరసన సెగ తగిలింది. వెలగపూడిలో అంబటి రాయుడు కాన్వాయ్‌ను అమరావతి రాజధాని రైతులు అడ్డుకున్నారు. అమరావతి రాజధానికి మద్దతు తెలపాలని కోరారు. అయితే.. అది తన పరిధి కాదని అంబటి రాయుడు తెలిపారు. దీనితో రాజధాని రైతులు నిరసన వ్యక్తం చేశారు. జై అమరావతి.. జైజై అమరావతి అంటూ రైతులు నినాదాలు చేశారు.
అమరావతి రాజధాని ప్రాంతంలోని వెలగపూడి వీరభద్రస్వామి ఆలయాన్ని సోమవారం మాజీ క్రికెటర్ అంబటి రాయుడు దర్శించుకున్నారు.రాయుడి రాకను తెలుసుకున్న అమరావతి రైతులు అక్కడికి చేరుకున్నారు. తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరారు. క్రికెట్ మ్యాచ్‌లలో అతని సెంచరీ కోసం తాము ప్రార్థించామని, అమరావతి కోసం తమ ప్రయత్నానికి మద్దతు ఇవ్వడం ద్వారా తమకు అతను సాయం చేయాలని కోరారు.
జై అమరావతి నినాదం చేయాలని..(Ambati Rayudu)
ఈ సందర్బంగా వారు అతడిని ‘జై అమరావతి’ నినాదం చేయాలని కోరారు. దీనికి రాయుడు అమరావతి ఎక్కడికీ వెళ్లనని, అదే చోటే ఉంటానని చెప్పి వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. రైతులు తమ నిరసన శిబిరాన్ని సందర్శించాలని అభ్యర్థించారు. అయితే రాయుడు వారి అభ్యర్థనను తిరస్కరించి దీనికి సమయం లేదని పేర్కొన్నారు. మరోసారి సందర్శిస్తానని హామీ ఇచ్చారు. అయితే రాజధానికి మద్దతు ఇవ్వకపోవడంతో రాయుడుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాయుడు ఇటీవల క్రికెట్ నుంచి వైదొలగారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.