Rs 2000 Denomination : 2 వేల నోట్ల రద్దుకు అసలు కారణం ఏంటో తెలుసా..!
భారతీయ రిజర్వు బ్యాంకు రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు రూ.2 వేల నోట్ల ఇవ్వకూడదని బ్యాంకులకు మే 19 వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు తక్షణమే అమల్లోకి కూడా వచ్చాయి. అలాగే, సెప్టెంబరు 30 వరకు మాత్రమే రూ.2 వేల
Rs 2000 Denomination : భారతీయ రిజర్వు బ్యాంకు రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వినియోగదారులకు రూ.2 వేల నోట్ల ఇవ్వకూడదని బ్యాంకులకు మే 19 వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు తక్షణమే అమల్లోకి కూడా వచ్చాయి. అలాగే, సెప్టెంబరు 30 వరకు మాత్రమే రూ.2 వేల నోటు చెల్లుబాటు అవుతుందని ఆర్బీఐ పేర్కొంది. అంటే రూ.2 వేల నోట్లు ఉన్నవారు బ్యాంకుల్లో ఆ తేదీ లోపు మార్చుకోవచ్చు. ఈ నెల 23 నుంచి బ్యాంకుల్లో వినియోగదారులు రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చు. కాగా 2018-2019 ఆర్థిక ఏడాది లోనే ఆర్బీఐ రూ.2 వేల నోట్ల ముద్రణను ఆపేసిన విషయం తెలీసిందే.