Kandula Narayana Reddy : తెదేపా మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి రోడ్డు ప్రమాదం.. తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. తలకు స్వల్ప గాయం కాగా, కుడి కాలు విరిగినట్లు సమాచారం అందుతుంది. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని
Kandula Narayana Reddy : ప్రకాశం జిల్లా మార్కాపురం టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తుంది. తలకు స్వల్ప గాయం కాగా, కుడి కాలు విరిగినట్లు సమాచారం అందుతుంది. మార్కాపురం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఆ సమయంలో కారులో నారాయణ రెడ్డి, డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదంలో కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు.
ప్రమాదానికి అతివేగమే కారణంగా భావిస్తుండగా.. ఆ వేగానికి కారు అదుపు తప్పి రహదారి పక్కనున్న పొలం లోకి దూసుకొని వెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు కూడా ధ్వంసమైంది. గాయపడిన నారాయణ రెడ్డిని 108 వాహనంలో యర్రగొండపాలెం లోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కందుల నారాయణరెడ్డి ఒక్కసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టగా.. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు పెద్ద కొండారెడ్డి చేతిలో ఓడిపోయారు. 2009లో మళ్ళీ అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేపై గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత 2014, 2019లలో వరుసగా ఆయన వైసీపీ చేతిలో ఓడిపోయారు. ఇక మే 15 వ తేదీన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పొదిలి పంచాయతీ పోతవరం గ్రామం నుంచి కాటూరివారిపాలెం గ్రామం వరకూ సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఊహించని రీతిలో నారాయణరెడ్డి తీవ్రగాయాలపాలు కావడంపై టీడీపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. తమ నాయకుడు ప్రమాదానికి గురి కావడం బాధ కలిగిస్తోందని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని రాజకీయాలకు అతీతంగా మార్కాపురం ప్రజలు కోరుకుంటున్నారు.