Last Updated:

Army Jawan Anil: స్వగ్రామానికి జవాన్‌ అనిల్‌ భౌతికకాయం.. ప్రారంభమైన అంతిమయాత్ర

Army Jawan Anil: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆర్మీ జవాన్ అనిల్ అమరుడైన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆయన భౌతికకాయం స్వగ్రామానికి చేరుకుంది.

Army Jawan Anil: స్వగ్రామానికి జవాన్‌ అనిల్‌ భౌతికకాయం.. ప్రారంభమైన అంతిమయాత్ర

Army Jawan Anil: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆర్మీ జవాన్ అనిల్ అమరుడైన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆయన భౌతికకాయం స్వగ్రామానికి చేరుకుంది. శుక్రవారం సాయంత్రమే హకీంపేట్ చేరుకోగా.. అక్కడ అధికారులు నివాళులు అర్పించారు. స్వగ్రామానికి చేరుకున్న అనిల్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ మేరకు పలువురు రాజకీయ నేతలు నివాళులు అర్పించారు.

ప్రారంభమైన అంతిమయాత్ర.. (Army Jawan Anil)

జమ్మూ కశ్మీర్‌లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో ఆర్మీ జవాన్ అనిల్ అమరుడైన విషయం తెలిసిందే. శనివారం ఉదయం ఆయన భౌతికకాయం స్వగ్రామానికి చేరుకుంది.

శుక్రవారం సాయంత్రమే హకీంపేట్ చేరుకోగా.. అక్కడ అధికారులు నివాళులు అర్పించారు. స్వగ్రామానికి చేరుకున్న అనిల్ అంతిమయాత్ర ప్రారంభమైంది.

ఈ మేరకు పలువురు రాజకీయ నేతలు నివాళులు అర్పించారు. మృతదేహం స్వగ్రామానికి చేరుకోగానే.. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

అనిల్‌ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌.

మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్.. జమ్ము కశ్మీర్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. హెలికాప్టర్ కూలిన ఘటనలో అనిల్ మృతిచెందాడు.

ఇటీవలే 45 రోజుల పాటు లీవ్‌లో ఉండి పదిరోజుల క్రితమే విధుల్లో చేరాడు. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

మంత్రి కేటీఆర్‌ సంతాపం..

అనిల్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మృతిపట్ల పట్ల కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అనిల్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆర్మీ జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

గ్రామంలో విషాదఛాయలు..

అనిల్ మృతిలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మెున్నటివరకు కళ్ల ముందే తిరిగిన వ్యక్తి.. చనిపోయాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

అనిల్‌ భార్య సౌజన్య రోదనలు మిన్నంటాయి. నాన్న లేడని అందరూ అంటుంటే చిన్నారులు బేల మొహంతో దీనంగా చూడడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.

సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు మల్కాపూర్ గ్రామాన్ని ఆర్మీ అధికారులు సందర్శించారు. ఈ మేరకు రూట్ మ్యాప్ సిద్దం చేశారు.