Pm Narendra Modi : పరీక్ష పే చర్చలో ప్రధాని మోదీని ప్రశ్నించిన తెలంగాణ విద్యార్థిని.. ఏం అడిగిందంటే ?
పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రతీ ఏటా ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఈసారి కూడా ప్రారంభించారు. ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో పరీక్షా పే చర్చ 2023 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా
Pm Narendra Modi : పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రతీ ఏటా ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఈసారి కూడా ప్రారంభించారు.
ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో పరీక్షా పే చర్చ 2023 కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా వేలాది మంది ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా వీక్షించారు.
ఈ మేరకు 200 మంది విద్యార్థులు హాజరయ్యారు.
విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ప్రధాని చెప్పిన విషయాలను ఆలకించారు.
ప్రధాని మోదీ (Pm Narendra Modi)ని ఆశ్చర్యపరిచిన తెలంగాణ విద్యార్ధిని..
అయితే ఈ కార్యక్రమంలో ఒక తెలంగాణ విద్యార్ధిని ప్రధాని మోదీని ఆశ్చర్యపరిచింది.
పరీక్ష పే చర్చలో.. బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి చేయాల్సి ఉందని ఆ విద్యార్ధిని మోదీని ప్రశ్నించింది.
ఆ విద్యార్దిని రంగారెడ్డి జిల్లా జవహర్ విద్యాలయకు చెందిన అక్షరగా గుర్తించారు.
ఆమె ప్రశ్నకు బదులిచ్చిన ప్రధాని.. కార్మికులు నివసించే బస్తీలోని ఒక చిన్నారిని ఉదాహరణగా చెప్పారు.
దేశంలో అతి ప్రాచీన భాష తమిళ్ అని అన్నారు.
8 ఏండ్ల చిన్నారి మలయాళం, మరాఠీ, హిందీ, బెంగాలీ, తమిళ్ మాట్లాడటం ఆశ్చర్యపరిచింది అని తెలిపారు.
బస్తీలో నివసించే 8 ఏండ్ల చిన్నారి అన్ని భాషలు ఎలా మాట్లాడటం ఎలా సాధ్యమైందో తెలుసుకున్నానన్నారు.
ఆమె అన్ని భాషలు మాట్లాడేందుకు కారణాలున్నాయని .. ఆ చిన్నారి ఇంటి పక్కన నివసించే వారు ఒక్కో రాష్ట్రానికి చెందిన వారున్నారు
ఎక్కడి నుంచో బతికేందుకు వచ్చిన వారంతా ఒక దగ్గర నివసించడంతో వారితో నిత్యం మాట్లాడుతూ ఆ చిన్నారి అన్ని భాషలు నేర్చుకుంది అని వివరించారు.
There is a very thin line between criticism and obstruction. Parents must criticise in a constructive, positive way: PM Modi during ‘Pariksha Pe Charcha’ 2023 pic.twitter.com/mecNyljn3w
— ANI (@ANI) January 27, 2023
అలానే ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పేరెంట్స్ తమ స్టేటస్ కోసం పిల్లలపై ఒత్తడి పెట్టొదని సూచించారు. ఇక పరీక్షా పే చర్చ తనకు కూడా పరీక్షేనని అన్న ప్రధాని.. కోట్లాది మంది విద్యార్థులు తన పరీక్షకు హాజరవుతున్నారని, ఇందుకు తనకు సంతోషంగా ఉందని తెలిపారు.
విద్యార్థులను కేవలం చదువు విషయంలోనే ఒత్తిడి పెంచొద్దని, ఇతర విషయాల్లోనూ వారిని ప్రోత్సహించాలని మోదీ పిలుపునిచ్చారు.
విద్యార్థులను ఒత్తిడిని ప్రధాని క్రికెట్‌తో పోల్చారు. విద్యార్థులు తమ సామర్థ్యాలను తక్కువ చేసుకోకూడదని, జీవితంలో టైం మేనేజ్మెంట్ అతి ప్రధానమని తెలిపారు.
తల్లుల నుంచి టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.
జీవితంలో పరీక్షలు వస్తాయి పోతాయి, కానీ జీవితాన్ని గడపాలని తెలిపారు. పరీక్షల కోసం షార్ట్కార్ట్స్ వెతుక్కొవదన్న మోదీ.. కాపీ చేయడం కంటే చదువుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
కాపీ చేస్తే ఒక్క పరీక్షలో నెగ్గొచ్చు, కానీ జీవితాన్ని నెగ్గలేరు అంటూ విద్యార్థులకు హితబోధ చేశారు.
ఇక అంతకు ముందు చిన్నారులు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రధాని వీక్షించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/