Last Updated:

Ind vs Nz t20: నేడు తొలి టీ20.. పట్టుదలతో న్యూజిలాండ్‌

Ind vs Nz t20: న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు మ్యాచులు గెలిచి టీమిండియా ఉత్సాహంతో ఉండగా.. ఎలాగైన మెుదటి టీ20 మ్యాచులో గెలవాలని కివీస్ పట్టుదలతో ఉంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

Ind vs Nz t20: నేడు తొలి టీ20.. పట్టుదలతో న్యూజిలాండ్‌

Ind vs Nz t20: న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు మ్యాచులు గెలిచి టీమిండియా ఉత్సాహంతో ఉండగా..
ఎలాగైన మెుదటి టీ20 మ్యాచులో గెలవాలని కివీస్ పట్టుదలతో ఉంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

వరుస విజయాలతో భారత్ దూసుకుపోతుంది. రెట్టించిన ఉత్సాహంతో టీ20 సిరీస్ పోరుకు సిద్ధమైంది టీమిండియా. పొట్టి క్రికెట్ లో న్యూజిలాండ్ కు మంచి రికార్డ్ ఉంది. దీంతో నేడు జరిగే పోరుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ లో రోహిత్, కోహ్లి, రాహుల్, షమి, సిరాజ్ లకు విశ్రాంతినిచ్చారు. దీంతో హర్దిక్ పాండ్యా కెప్టెన్సీలో యువజట్టు బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచుకు కీలక ప్లేయర్లు విశ్రాంతి తీసుకోవడంతో.. కివీస్ ఎలా ప్రతిఘటిస్తుందో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ మ్యాచులో యువ బ్యాట్స్ మెన్స్ ఓపెనర్లుగా వచ్చే అవకాశం ఉంది.

ఇషాన్ కిషాన్, శుభ్ మన్ గిల్ (Shubman Gill) ఇద్దరు మంచి ఫామ్ లో ఉండటంతో.. ఈ మ్యాచులో పరుగుల వరద పారే అవకాశం ఉంది.

మిడిలార్డర్ లో సూర్య కుమార్ ఉండటం.. రాహుల్‌ త్రిపాఠి, హార్దిక్‌, దీపక్‌ ఉండటంతో టీమిండియా బ్యాటింగ్‌ బలంగా కనిపిస్తుంది.

చాలా రోజుల తర్వాత ఈ సిరీస్ లోకి పృథ్వీ షా వచ్చాడు.

ఇక బ్యాటింగ్ లో మెరుగ్గా ఉన్నా.. బౌలింగ్ ను ఇంకాస్త మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉంది.

అర్ష్‌దీప్‌ బౌలింగ్‌ కాస్త భారత్ కు ఇబ్బందిగా మారనుంది. శ్రీలంకతో జరిగిన ఓ మ్యాచులో కేవలం రెండు ఓవర్లలో.. 37 పరుగులు సమర్పించుకున్నాడు.

ఈ మ్యాచులో శివమ్‌ మావి ని చూసే అవకాశం ఉంది. మంచి వేగంతో శివమ్ మావి బౌలింగ్ చేయగలడు. ఉమ్రాన్‌ మాలిక్‌, శివమ్ మావి, అర్ష్‌దీప్‌ నేడు కీలకం కానున్నారు.

వరుసగా మూడు వన్డేలు ఓడటంతో.. కివీస్ పట్టుదలతో ఉంది. కానీ ఈ మ్యాచులో విలియమ్సన్‌, సౌథీ లేకపోవడం కివీస్ కు దెబ్బే.

న్యూజిలాండ్  జట్టుకు శాంట్నర్‌ కెప్టెన్ గా ఉన్నాడు. ఫిన్‌ అలెన్‌, ఫిలిప్స్‌, కాన్వే, బ్రాస్‌వెల్‌ వంటి హిట్టర్లతో బ్యాటింగ్ మెరుగ్గా ఉంది.

కానీ కివీస్ బౌలింగ్ లో ఫెర్గుసన్ మినహా మిగతా బౌలర్లు పెద్దగా రాణించడం లేదు.

 

తుది జట్లు

టీమిండియా: శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషాన్, సూర్యకుమార్‌ యాదవ్, రాహుల్‌ త్రిపాఠి, హార్దిక్‌, దీపక్‌ హుడా, సుందర్‌, శివమ్‌ మావి, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌, కుల్‌దీప్‌;

న్యూజిలాండ్‌: అలెన్‌, కాన్వే, గ్లెన్‌ ఫిలిప్స్‌, చాప్‌మన్‌, మిచెల్‌, బ్రాస్‌వెల్‌, శాంట్నర్‌, టిక్నర్‌, ఇష్‌ సోధి, బెన్‌ లిస్టర్‌, ఫెర్గూసన్‌

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/