Senior Actress Jamuna: దివికేగిన సత్యభామ.. సీనియర్ నటి జమున మృతి
సీనియర్ నటి జమున దివికేగారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కన్నుమూసినట్లు తెలుస్తుంది. 1936 ఆగస్ట్ 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది.
Senior Actress Jamuna : సీనియర్ నటి జమున దివికేగారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కన్నుమూసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఆమె వయసు 86 సంవత్సరాలు.. కాగా అనారోగ్య కారణాల వల్ల జమున మృతి చెందినట్లు భావిస్తున్నారు.
1936 ఆగస్ట్ 30న హంపీలో జమున జన్మించారు. ఆమె తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి.
జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది.
ఆమె నటించిన తొలిచిత్రం పుట్టిల్లు.
రామారావు, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించింది.
మేటి తరం కథానాయికలలో అగ్ర తారల్లోజమున కూడా ఒకరు.
మహానటి సావిత్రితో పాటు పలు సినిమాల్లో జమున కలిసి నటించారు.
తన అందంతోనే కాకుండా, అభినయం, నృత్యాలతో ఆమె ప్రేక్షకులను అలరించారు.
జమున కర్ణాటకలోని హంపిలో జన్మించారు.
అయిన కానీ ఆమె మాతృ భాష తెలుగు కాకపోయినప్పటికీ తెలుగు పరిశ్రమనే తన సొంత పరిశ్రమగా భావించి ఇక్కడే స్థిరపడిపోయారు.
జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనీయంలలో శిక్షణ ఇప్పించారు.
మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా, ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు (1953)లో నటిగా అవకాశం ఇచ్చారు.
తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ సినిమాల్లో ఆమె నటించారు.
తెలుగు, దక్షిణభారత భాషల్లో కలిపి ఆమె 198 సినిమాలు చేశారు.
1967లో ఆమె హిందీలో నటించిన మిలన్ సినిమా.. 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది.
ఎన్ని పాత్రల్లో నటించినా ఆమెకు బాగా పేరు తెచ్చింది మాత్ర సత్యభామ క్యారెక్టరే. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జీవించారు జమున.
సినిమాలతో పాటు రాజకీయాల్లో సైతం ఆమె రాణించారు.
1980లలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జమున రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపీగా ఎన్నికయ్యారు.
ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నప్పటికి.. 1990వ దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు.
తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఫిలింఫేర్ తో పాటు పలు అవార్డులు ఆమెను వరించాయి.
ఆమె మరణ వార్తతో టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.
పలువురు సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్నిసోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/