Last Updated:

Venkaiah Naidu: మెరుగైన రోడ్లతోనే అభివృద్ధి సాధ్యం…మాజీ రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు

నీరు, రోడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ మేరకు రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి చురకలు అంటించారు

Venkaiah Naidu: మెరుగైన రోడ్లతోనే అభివృద్ధి సాధ్యం…మాజీ రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు

Venkaiah Naidu: నీరు, రోడ్లు, విద్యుత్ వంటి కనీస వసతులను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించిన సందర్భంలో ఆయన ఈ మేరకు రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ప్రభుత్వానికి చురకలు అంటించారు.

రోడ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. అప్పుడే గ్రామాలు, పట్టణాలు, దేశం బాగుపడుతుందని వ్యాఖ్యానించారు. గతంలో తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టానని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతవాసులు అధికంగా పట్టణ ప్రాంతాలకు వస్తుంటారని, వారికి కనీస సౌకర్యాలలో ఒకటైన రోడ్లను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

తాను పొదలకూరుకు వెళ్లే క్రమంలో రోడ్లు బాగలేదని తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా పరిషత్ కార్యాలయాలు రోడ్లను మరింతగా మెరుగు పరచాలని ఆయన సూచించారు. దేశం అభివృద్ధికి మెరుగైన రవాణా సౌకర్యం ఎంతో కీలకంగా పేర్కొన్నారు. వాజ్ పాయ్ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన మంత్రి సడక్ యోజన పధకాన్ని తీసుకొచ్చిన్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికీ ఆ బోర్డులు పలుచోట్లు ఉన్నాయన్నారు. అనంతరం కూడా మరిన్ని అభివృద్ధి జరిగాయన్నారు.

ఇది కూడా చదవండి:Dasara Effect: దసరా ఎఫెక్ట్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

ఇవి కూడా చదవండి: