Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ షో అశ్లీలత పై హైకోర్టు ఆగ్రహం
నేడు సినిమాలు, ప్రత్యేక ఫోలలో అశ్లీలతే ప్రధాన అంశంగా మారిపోయింది. దీనిపై సమాజ సేవకులు అనేక సందర్భాలలో అశ్లీలతను విడనాడాలని పేర్కొనివున్నారు. తాజాగా బిగ్ బాస్ షో అశ్లీలత పై ఏపి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది
Amaravati: ఒకప్పుడు సినిమాల్లో నటించే డాన్సర్లకు నేడు నటించే నటీమణులకు తేడా లేకుండా పోయింది. నాడు వినోదం పేరుతో వీక్షించే కార్యక్రమాల్లో అశ్లీలత ఒక పాటలో మాత్రమే ఉంటే, నేడు సినిమాలు, ప్రత్యేక షోలలో అశ్లీలతే ప్రధాన అంశంగా మారిపోయింది. దీనిపై సమాజ సేవకులు అనేక సందర్భాలలో అశ్లీలతను విడనాడాలని పేర్కొనివున్నారు.
తాజాగా బిగ్ బాస్ షోలో అశ్లీలత పై ఏపి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాచారం మేరకు, బహుళ ప్రచారం పొందిన అనేక షోలలో తెలుగు బిగ్ బాస్ షో కూడా ఒకటి. ఇందులో అశ్లీలత అంశం పరిధి దాటి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుందని, కుటుంబ సమేతంగా షోను టీవీలో చూసేందుకు వీలు లేకుండా పోయిన నేపథ్యంలో కోర్టులో పిల్ దాఖలైంది.
దీనిపై ధర్మాసనం విచారణ చేస్తున్న సమయంలో పిటిషనర్ తరపు న్యాయవాది ఐబీఎఫ్ నిబంధనలను బిగ్ బాస్ షో నిర్వాహకులు పాటించలేదని పేర్కొన్నారు. అశ్లీలత అంశం అధికంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. న్యాయస్ధానం సైతం అశ్లీలత పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 1970 నాటి సినిమాల్లోని విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. కేంద్రం తరపు న్యాయవాది దీనిపై స్పందించేందుకు సమయం కోరారు. ప్రతివాదులకు నోటీసు విషయం పై తదుపరి వాయిదాలో ఏ సంగతి నిర్ణయిస్తామని న్యాయస్థానం పేర్కొనింది. అక్టోబర్ 11కు కేసు వాయిదా పడింది.
ఇది కూడా చదవండి: భాజాపా ప్రజాపోరు యాత్ర వాహనానికి నిప్పు పెట్టిన దుండగులు