Last Updated:

Praja Poru Yatra: భాజాపా ప్రజాపోరు యాత్ర వాహనానికి నిప్పు పెట్టిన దుండగులు

గుంటూరు జిల్లా తెనాలిలో భాజాపా ప్రజాపోరు యాత్ర వాహనానికి గుర్తు తెలియన దుండగులు నిప్పు పెట్టారు. ఈ నెల 21 నుండి తెనాలిలో ప్రజా పోరు యాత్రను భాజాపా చేపట్టింది

Praja Poru Yatra: భాజాపా ప్రజాపోరు యాత్ర వాహనానికి నిప్పు పెట్టిన దుండగులు

Praja Poru Yatra: గుంటూరు జిల్లా తెనాలిలో భాజాపా ప్రజాపోరు యాత్ర వాహనానికి గుర్తు తెలియన దుండగులు నిప్పు పెట్టారు. ఈ నెల 21 నుండి తెనాలిలో ప్రజా పోరు యాత్రను భాజాపా చేపట్టింది. ఇందులో భాగంగా నిన్నటిదినం రాత్రి సమయంలో సుల్తానాబాద్ ప్రాంతంలో రోడ్డు పక్కన వాహనాన్ని నిలిపివుంచారు. తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు వాహనానికి నిప్పు పెట్టారు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

స్థానికుల వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. నలుగురు వ్యక్తులు బాటిళ్లతో వచ్చి వాహనంపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టిన్నట్లు స్థానికుల కధనంతో తెలుస్తుంది.

అధికార వైకాపా శ్రేణులే ఈ దుశ్చర్యకు పాల్పొడివుంటారని భాజాపా పార్టీ ఆరోపించింది. ఇది కక్ష్యపూరిత చర్యగా పేర్కొన్నారు. కేసులు పెట్టడం, వాహనాలను తగలబెట్టడం, విధ్వంసం సృష్టించడం వైకాపాకు పరిపాటిగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన అట్టడుగు స్థాయికి చేరిందని, వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తూ ప్రతపక్షాలపై దాడులు చేస్తూ, అభివృద్ధిని విస్మరించిందంటూ భాజాపా ప్రజాపోరు యాత్రను చేపట్టింది.

ఇది కూడా చదవండి: Vande Bharat Express: సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

ఇవి కూడా చదవండి: