Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. మూడు రోజుల్లోనే టికెట్ డబ్బులు వాపస్

Railways Cancellation Ticekt Money will be Refunded within Three Days: సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో రద్దయిన రైళ్లకు సంబంధించిన టికెట్ డబ్బులను ప్రయాణికులకు మూడు రోజుల్లోగా వాపస్ చేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. అయితే కౌంటర్‌లో తీసుకున్న టికెట్‌కు సంబంధించి మూడు రోజుల్లోగా సంబంధిత రైల్వే స్టేషన్‌లో ఇచ్చి డబ్బులు పొందవచ్చని సూచించింది. సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులు టికెట్ డబ్బుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదు.