Manchu Vishnu: జర్నలిస్ట్ దాడి సంఘటనపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్
Manchu Vishnu Press Meet: మంచు మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. హైబీపీ, బాడీ పెయిన్స్‌తో మంగళవారం రాత్రి ఆయన కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులు తెలిపారు. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఓ వైపు ఆయనపై ఆస్పత్రిలో ఉంటే మరోవైపు మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్ట్ సంఘాలు ఫిలిం ఛాంబర్ ఎదుట ఆందోళన చెపట్టారు ఈ క్రమంలో తాజాగా మంచు విష్ణు మీడియా ముందుకు వచ్చారు. మనోజ్ వ్యాఖ్యలు చేసిన కాసేపటికి విష్ణు మీడియా ముందుకు రావడం గమనార్హం.
కాంటినెంటల్ ఆసత్రిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. అన్ని ఉమ్మడి కుటుంబాల కంటే తమ కుటుంబం కాస్తా భిన్నంగా ఉంటుందని అనుకున్నామని, అంతా కలిసిమెలిసి ఉంటామని అనుకునే వాడిని. కానీ ఈ రోజు మా కుటుంబంలో ఇలాంటి గొడవలు వస్తాయని అసలు ఊహించలేదన్నారు. “ఇలాంటి గొడవలు ప్రతి ఇళ్లలో ఉంటాయి. దీన్ని ఇంత పెద్ద రాద్దంతం చేయాల్సిన అవసరం లేదు. మాది సెలబ్రిటీ కుటుంబం కారణంగా దీన్ని ప్రజల్లోకే తీసుకువెళ్లడం కరెక్టే. కానీ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. నేను దుబాయ్‌లో కన్నప్ప షూటింగ్‌లో ఉన్నప్పుడు గొడవల గురించి తెలిసిందే. నేను లేని ఈ మూడు రోజులు ఇంత జరగడం ఏంటని షాక్ అయ్యాను.
నిన్న మా నాన్న టీవీ రిపోర్టర్‌పై దాడి చేసిన సంఘటన అనుకోకుండ జరిగింది. ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఇది జరిగి ఉండకూడదు. అలా అని అది కరెక్ట్ అని నేను అనను. కానీ గత మూడు రోజులుగా జరుగుతున్న సంఘటనల కారణంగా ఆయన ఒత్తిడికి లోనయ్యారు. మీరు గమనిస్తే నిన్న ఆయన చేతులు జోడిస్తూ మీడియా ముందుకు వచ్చారు. అదే టైంలో ఒక్కసారిగా ఆయన ముందు కెమెరాలు పెట్టడం, లైట్స్ పడటంతో ఆయన మరింత ఒత్తిడికి గురయ్యారు. ఈ క్రమంలో ఆయన అనుకోకుండ దాడి చేశారు. ఓ తండ్రిగా ఆయన రియాక్లైయిన విధానం చూస్తే ఇది తక్కువే అని అని చెప్పాలి. నిజానికి మీడియాను గౌరవించే వ్యక్తి ఆయన. అలా జరిగి ఉండకూడదు. ఎవరైతే గాయపడ్డారో ఆ రిపోర్టర్ ఫ్యామిలీతో నేను మాట్లాడాను. వారితో టచ్‌లో ఉన్నాను. దయచేసి మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా” అంటూ విష్ణు చెప్పుకొచ్చారు.