Dilawarpur Ethanol Factory: ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేత.. సీఎం రేవంత్‌కు రైతుల పాలాభిషేకం
Widespread protests by villagers prompt authorities to stop ethanol factory: నిర్మల్ జిల్లా రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దిలావర్ పూర్ మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ఆదేశించినందుకు సీఎం రేవంత్, మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్థానిక రైతులు నిరసన తెలపడంతో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన పనులను ఆపివేసింది. అయితే గత ప్రభుత్వమే ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు మంత్రులు తెలిపారు.
ఇదిలా ఉండగా, దిలావర్ పూర్‌లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇథనాల్ పరిశ్రమకు సంబంధించిన పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కలెక్టర్ అభిలాష అభినవ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఇథనాల్ పరిశ్రమ వద్దంటూ చాలా రోజులుగా దిలావర్ పూర్ లో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.
కాగా, ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. పలు ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించగా.. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్తులకు తెలిపారు. పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దిలావర్‌పూర్ ఇథనాల్ పరిశ్రమ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చిన అనుమతులు పునఃసమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు పరిశీలిస్తోంది.