Last Updated:

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ దుర్గమ్మకి బహుకరించిన చీర.. ఎవరికి దక్కింది అంటే?

పవర్ స్టర్ పవన్ కళ్యాణ్ గత నెల 25 వ తేదీన విజయవాడ వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన ప్రచార రథం వారాహికి విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా కొండపైకి వారాహిని అనుమతించకపోవడంతో ఇంద్రకీలాద్రి కిందనే శాస్త్రోక్తంగా పవన్ పూజలు చేశారు.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ దుర్గమ్మకి బహుకరించిన చీర.. ఎవరికి దక్కింది అంటే?

Pawan Kalyan : పవర్ స్టర్ పవన్ కళ్యాణ్ గత నెల 25 వ తేదీన విజయవాడ వచ్చిన విషయం తెలిసిందే.

ఈ మేరకు తన ప్రచార రథం వారాహికి విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగా కొండపైకి వారాహిని అనుమతించకపోవడంతో ఇంద్రకీలాద్రి కిందనే శాస్త్రోక్తంగా పవన్ పూజలు చేశారు.

మరోవైపు జనసేన వీర మహిళలు 108 బిందెలలో పసుపు, కుంకుమ కలిపిన నీళ్ళతో వారాహికి పూజ చేశారు.

అనంతరం పవన్ వారాహి పైకి ఎక్కి మాట్లాడారు.. రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యమని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు ముందుండాలని తాను కోరుకుంటానని చెప్పారు.

అయితే పవన్ కళ్యాణ్ విజయవాడకు వస్తున్నారని ముందే ప్రకటించడంతో ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

అడుగడుగున పవన్ కు నీరాజనాలు పలుకుతూ బెజవాడ రోడ్లన్నీ జనసముద్రాన్ని తలపించాయి.

భారీ క్రేన్ సాయంతో పవన్ కళ్యాణ్ కి గజమాలలు వేశారు.

pawan kalyan

pawan kalyan

pawan kalyan in vijayawada

pawan kalyan in vijayawada

pawan kalyan in vijayawada durga temple photos

 

8 వేల రూపాయల విలువైన చీరను పవన్ కళ్యాణ్ అమ్మ వారికి సమర్పించారు.

కాగా నేడు పవన్ సమర్పించిన ఈ చీరను నేడు అమ్మ వారికి అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

బెజవాడ దుర్గగుడిలో భక్తులు సమర్పించిన చీరలను ఏటా వేలం వేస్తుంటారు.

అయితే ఇప్పుడు ఆ చీరల్లో పవన్ కల్యాణ సమర్పించిన చీర ఉండటంతో అంతా దాన్ని కొనేందుకు పోటీ పడుతున్నారట.

ఈ తరుణంలోనే అమ్మవారికి పవన్ సమర్పించిన చీరకు భారీ డిమాండ్ ఏర్పడింది.

దీంతో ఆ చీరల కాంట్రాక్టర్‌పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని సంచారం అందుతుంది.

ఆ చీరను ఎంతకైనా దక్కించుకోవాలని జనం పోటీ పడుతున్నారట.

ఎంత రేట్ అయినా ఫర్వాలేదు తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ వందల సంఖ్యలో ఫోన్లు వస్తున్నాయని టాక్ నడుస్తుంది.

దీంతో చివరకు చేసేది ఏం లేక పాత ప్లాన్ నే అమలు చేయబోతున్నారని తెలుస్తుంది.

ఆ ప్లాన్ ఏంటంటే..

గతంలో కూడా చిరంజీవి దంపతులు సమర్పించిన చీర కోసం ఇలానే పోటాపోటీగా అభిమానలు ఆ కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు.

దీంతో ఏం చేయాలో తెలియక చిరంజీవి ఇచ్చిన చీరను వారి ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడు అందివ్వాలని ప్లాన్ చేశారు.

అలా దుర్గాదేవికి చిరంజీవి ఇచ్చిన చీరను తర్వాత కాలంలో దర్శనానికి వచ్చిన అల్లు అరవింద్‌ దంపతులకు కానుకగా ఇచ్చారు.

దీంతో ఆ సమస్యకు పరిష్కారం లభించింది.

మళ్ళీ ఇప్పుడు అదే రీతిలో మెగా ఫ్యామిలీకి చెందిన వారికే పవన్ సమర్పించిన చీరను అందించనున్నట్లు తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీలో ఈసారి ఎవరైనా దుర్గ గుడిని సందర్శించుకుంటే వారికి ఆ చీరను కానుకగా ఇవ్వనున్నారు.

పవన్‌ రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపైనా కిందా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/