Home / ట్రెండింగ్ న్యూస్
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో సేవలు మంగళవారం నిలిచిపోయాయి. జియో యూజర్లు కాలింగ్, మెసేజింగ్ వంటి పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై పలువురు యూజర్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. దానితో ప్రస్తుతం ట్విట్టర్లో #Jiodown హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.
ఓ చిన్నదోమ అతడి జీవితాన్నే నాశనం చేసింది. దోమకాటుతో ఓ వ్యక్తి బతికుండగానే నరకం చూశాడు. కొన్నివారాలపాటు కోమాలోనే ఉండిపోయాడు. ఈ ఘటన జర్మనీలో చోటుచేసుకుంది.
వెంకీ అట్లూరి ద్విభాషా చిత్రం సర్‌తో కోలీవుడ్ హీరో ధనుష్ తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. అతను మరో తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో కూడా ఓ సినిమా చేయడానికి సైన్ చేసిన సంగతి తెలిసిందే.
సాయిపల్లవి ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దక్షిణాదిలో స్టార్ హీరోలను మించి ఇమేజ్ తో పాటు ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న బ్యూటీ. అంత స్టార్ డమ్ ఉన్న ఈ హీరోయిన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలో తాను సినిమాలకు గుడ్ బై చేప్పబోతుందట.
జియో ఫేస్బుక్- ఇన్స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీగా సరికొత్త యాప్ తో వినియోదారులను ఆకర్షించేందుకు సన్నద్దమవుతుంది. "ప్లాట్‌ఫామ్" పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు జియో ప్రణాళికలు చేస్తుంది.
ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు కొట్టి నయా రికార్డు నెలకొల్పాడు రుతురాజ్ గైక్వాడ్. విజయ్ హజారే ట్రోఫీలో రెండో క్వార్టర్ ఫైనల్ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్‌పై గైక్వాడ్ ఈ అరుదైన ఘనత సాధించాడు.
మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా గతవారంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు మహిళాసంఘాలు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేశాయి. ఈ క్రమంలో తాజాగా ఆ వ్యాఖ్యలపై రాందేవ్ మహిళలకు క్షమాపణలు తెలిపారు.
ఒక సమాచారాన్ని షాట్ అండ్ స్వీట్ గా ప్రజలకు తెలియజేసే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో దిగ్గజ సంస్థగా ట్విట్టర్ కు మంచి పాప్యులారిటీ ఉంది. అలాంటి ట్విట్టర్లో ఒక ట్వీట్ లో 280 క్యారెక్టర్ల వరకు టైప్ చేసే వెసులుబాటు ఉంది. కాగా ఈ పరిమితిని 420కు పెంచే అవకాశం ఉంది.
తెలంగాణలోని మరో రెండు చారిత్రక కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోటకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి.
మరోసారి మస్క్ నెట్టింట వైరల్ గా మారారు. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు మస్క్. ఈ రెండు కంపెనీలు తమ యాప్ స్టోర్ల నుంచి ట్విటర్‌ను తొలిగిస్తే గనుక యాపిల్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు పోటీగా తాను ప్రత్యామ్నాయంగా మొబైల్స్ తయారీలోకి ప్రవేశిస్తానని అన్నారు.