Last Updated:

Google Pixel 8a Price Drop: మీ మైండ్ బ్లాక్ అయ్యే డీల్.. గూగుల్ కాస్ట్‌లీ ఫోన్ చీప్‌గా కొనండి.. ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే..?

Google Pixel 8a Price Drop: మీ మైండ్ బ్లాక్ అయ్యే డీల్.. గూగుల్ కాస్ట్‌లీ ఫోన్ చీప్‌గా కొనండి.. ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే..?

Google Pixel 8a Price Drop: పిక్సెల్ 9a ఈ నెలలో లాంచ్ కానుంది. దీనికి ముందు ఈ సిరీస్ Google Pixel 8a ప్రస్తుత మోడల్ చౌకగా మారింది. కొత్త పిక్సెల్ లాంచ్‌కు సంబంధించి గూగుల్ ఎటువంటి తేదీని ధృవీకరించనప్పటికీ, కొన్ని లీక్‌లు ఫోన్ ధరను నిర్ధారించాయి. దీంతో పాటు ఫోన్‌కు సంబంధించిన హార్డ్‌వేర్ వివరాలు కూడా లీక్స్‌లో వెల్లడయ్యాయి.

9a దాని మునుపటి మోడల్ ధరతో ఈసారి విడుదల కావచ్చిని చాలా నివేదికలు చెబుతున్నాయి. ఫోన్‌లో టెన్సర్ G4 ప్రాసెసర్, 48-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా ఉండచ్చు. ఈ కొత్త ఫోన్ లాంచ్ కాకముందే Google Pixel 8a ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచాట్ డేస్ సేల్‌లో ఎటువంటి ఆఫర్ లేకుండా రూ. 15,000 చౌకగా అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక డీల్ గురించి తెలుసుకుందాం.

Google Pixel 8a Offers
ఈ గూగుల్ ఫోన్‌ను కంపెనీ 52,999 రూపాయలకు లాంచ్ చేసింది, అయితే ఇప్పుడు మీరు దీన్ని కేవలం 37,999 రూపాయలకే మీ సొంతం చేసుకోవచ్చు. మీరు UPI చెల్లింపు ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో మీరు 5శాతం వరకు అపరిమిత క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు. ఇది మాత్రమే కాదు ఫోన్‌పై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది, దీని నుండి మీరు పాత ఫోన్ కండిషన్‌పై రూ. 20 నుండి 25 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

Google Pixel 8a Features And Specifications
గూగుల్ పిక్సెల్ 9aలో అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్‌లను అందించవచ్చు, కానీ Pixel 8a కూడా ఈ ఆఫర్స్‌లో బెస్ట్ ఫోన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. పిక్సెల్ 8a గూగుల్ టెన్సర్ G3 చిప్‌ ఉంది. ఇందులో 8GB RAM కూడా ఉంది. ఫోన్ ఫ్లాగ్‌షిప్ పర్ఫామెన్స్, AI ఫీచర్స్ ఉంటాయి.

ఈ ఫోన్‌కు కంపెనీ 7 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌డేట్లు అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, Pixel 8a డ్యూయల్ కెమెరా సెటప్‌ ఉంది, ఇందులో 64 MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 13MP సెల్ఫీ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 4492 mAh బ్యాటరీ అందించారు.