Samsung Galaxy S25 Edge: ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారా..? అయితే మీకో బ్యాడ్ న్యూస్.. డేట్ మారింది..!

Samsung Galaxy S25 Edge: సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ కోసం వినియోగదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి వచ్చే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెలలో అంటే ఏప్రిల్‌లో లాంచ్ అవుతుందని చెబుతున్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త సమాచారం ప్రకారం సామ్‌సంగ్ ఈ సన్నని ఫోన్ వచ్చే నెలలో లాంచ్ కావచ్చు. దక్షిణ కొరియా బ్రాండ్ జనవరిలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను ప్రదర్శించింది. సామ్‌సంగ్ గెలాక్సీ S25 సిరీస్‌లోని ఇతర స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే, క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ కూడా ఇందులో తీసుకురావచ్చు.
లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చే నెల మే 13న లాంచ్ అవుతుంది. ముందుగా ఏప్రిల్ 15న లాంచ్ అవుతుందని చెప్పారు. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్‌లైన్ ఛానెల్ ద్వారా లాంచ్ చేస్తుంది అంటే దీని కోసం ఆఫ్‌లైన్ ఈవెంట్ నిర్వహించదు. ఫోన్ లీకైన రెండర్‌ల విషయానికి వస్తే.. ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను టైటానియం జెట్ బ్లాక్, టైటానియం సిల్వర్, టైటానియం ఐసీ బ్లూ కలర్స్‌లో అందించవచ్చు.
Galaxy S25 Edge Features
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్‌లో 6.6-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేతో లాంచ్ కావచ్చు. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ని ఫోన్‌లో చూడచ్చు. ఈ ఫోన్ మందం 5.84మిమీ ఉంటుంది. ఫోన్ ఇతర ఫీచర్ల గురించి మాట్లాడినట్లయితే ఇందులో 12జీబీ వరకు ర్యామ్ ఉండనుంది. అంతే కాకుండా, 200మెగాపిక్సెల్ మెయిన్, 12మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను ఫోన్‌లో చూడచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను 3,900mAh బ్యాటరీతో అందించవచ్చు, దీనితో 25W ఛార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ చాలా సన్నని ఆండ్రాయిడ్ ఫోన్‌గా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OneUI 7.0లో పని చేస్తుంది. ఈ సామ్‌సంగ్ ఫోన్ ధర రూ. 65,000 నుండి రూ. 80,000 మధ్య ఉండచ్చు.
ఇవి కూడా చదవండి:
- Honor Play 60 And Honor Play 60m Launched: అన్ని ఫోన్లలా కాదు భయ్యా.. ఈ కొత్త హానర్ ఫోన్ల క్రేజే వేరబ్బా.. తక్కువ ధరలో ఇలాంటి ఫోన్లు దొరకవు..!