Last Updated:

Nokia G60 5G Smart Phone: నోకియా జీ60 5జీ స్మార్ట్ ఫోన్‌ ధర ఎంతంటే!

త్వరలో ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయని నోకియా సంస్థ పేర్కొంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్‌తో నోకియా జీ60 5G వస్తోంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండే ఫుల్ HD+ Display ఈ స్మార్ట్ ఫోన్‌ కలిగి ఉంది.

Nokia G60 5G Smart Phone: నోకియా జీ60 5జీ స్మార్ట్ ఫోన్‌ ధర ఎంతంటే!

Nokia G60 5G: నోకియా నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ ఇండియాకు అతి త్వరలో ఇండియాకు రానుంది.నోకియా జీ60 5జీ స్మార్ట్ ఫోన్‌ అతిత్వరలో మన ముందుకు రానుంది. త్వరలో ప్రీ-బుకింగ్స్ మొదలవుతాయని నోకియా సంస్థ పేర్కొంది. 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్‌తో నోకియా జీ60 5G వస్తోంది.120Hz రిఫ్రెష్ రేట్ ఉండే ఫుల్ HD+ Display ఈ స్మార్ట్ ఫోన్‌ కలిగి ఉంది. నోకియా జీ60 5జీ స్మార్ట్ ఫోన్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇక్కడ చదివి చూడండి.

నోకియా జీ60 5జీ స్పెసిఫికేషన్లు..
6.58 ఇంచుల ఫుల్ HD+ DISPLAY నోకియా జీ60 5జీ వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ display , 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటాయి. డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్‌ రన్ అవుతుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది. మూడు OS అప్‌గ్రేడ్స్‌ను ఈ ఫోన్ అందుకుంటుందని నోకియా సంస్థ వారు పేర్కొన్నారు.

నోకియా జీ60 5జీ ధర అయితే ఇండియాలో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.19,999 నుంచి రూ.22,999 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిసిన సమాచారం.