Last Updated:

Samsung Galaxy S24 Ultra 5G: ఏమి ఆఫర్లు రా అయ్యా.. భారీగా తగ్గిన సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5జీ ధర..!

Samsung Galaxy S24 Ultra 5G: ఏమి ఆఫర్లు రా అయ్యా.. భారీగా తగ్గిన సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5జీ ధర..!

Samsung Galaxy S24 Ultra 5G: దక్షిణ కొరియా టెక్ కంపెనీ సామ్‌సంగ్ తన అత్యంత ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Galaxy S23 Ultraపై భారీ ఆఫర్ ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో 12GB RAM + 256GB స్టోరేజ్ కలిగిన ఈ వేరియంట్‌ను రూ.37 వేల కంటే ఎక్కువ తగ్గింపుతో కొనచ్చు. ఈ ఫోన్ S-పెన్ సపోర్ట్, Galaxy AI ఫీచర్లుకు సపోర్ట్ చేస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ S24 Ultra ప్రారంభ ధర రూ. 134,999. ఇప్పుడు అమెజాన్ దీనిపై 38 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని తర్వాత రూ. 97,450కి కొనచ్చు. ఈ ఫోన్ రూ. 1 లక్ష కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫీచర్లు, కెమెరా, బిల్డ్ క్వాలిటీ పరంగా గొప్ప వాల్యూ అందిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ టైటానియం గ్రే, టైటానియం బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌ల ద్వారా చెల్లించినట్లయితే  అదనపు తగ్గింపును పొందవచ్చు. ICICI యాక్సిస్, AU స్మాల్ ఫనాన్స్, IDFC ఫస్ట్ బ్యాంక్ కార్డ్‌ల సహాయంతో కస్టమర్‌లు చెల్లింపుపై రూ. 1000 వరకు తగ్గింపును పొందవచ్చు. అదే సమయంలో కస్టమర్‌లు 512GB స్టోరేజ్ వేరియంట్‌ను డిస్కౌంట్ తర్వాత రూ.108,689కి ఆర్డర్ చేయచ్చు.

Galaxy S24 Ultra 5G Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.8 అంగుళాల డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేను కలిగి ఉంది.  2500నిట్స్ పీక్ బ్రైట్నెస్‌ అందిస్తోంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. గరిష్టంగా 1TB నిల్వతో 12GB వరకు RAMని కలిగి ఉంది. ఈ ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీకి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా OneUIపై రన్ అవుతుంది.

కెమెరా సెటప్ గురించి మాట్లాడితే గెలాక్సీ S24 అల్ట్రా వెనుక ప్యానెల్ 200MP ప్రైమరీ, 12MP అల్ట్రా వైడ్ లెన్స్,  10MP ఆప్టికల్ టెలిఫోటో జూమ్ లెన్స్‌తో కూడిన కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇందులో 12MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ S-పెన్‌తో వస్తుంది దీనికి కంపెనీ ఐదేళ్లపాటు అండ్రాయిడ్, సేఫ్టీ అప్‌డేట్‌లను అందిస్తుంది.