CM Kcr: స్వప్నలోక్ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటన
సికింద్రాబాద్ లో రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా 5,7 అంతస్తుల్లో ఉన్న దుకాణాలు ధ్వంసం అయ్యాయి. షార్ట్ సర్య్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
CM Kcr: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok fire accident) అగ్ని ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కేసు నమోదు చేసిన పోలీసులు(CM Kcr)
సికింద్రాబాద్ లో రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా 5,7 అంతస్తుల్లో ఉన్న దుకాణాలు ధ్వంసం అయ్యాయి.
షార్ట్ సర్య్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బిల్డింగ్ లోపల చిక్కుకున్న 12 మందిని రక్షించారు. కానీ దురదృష్టవశాత్తు 6 గురు చనిపోయారు.
స్వప్న లోక్ బిల్డింగ్ జరిగిన అగ్నిప్రమాదంపై సికింద్రాబాద్ లోని మహంకాళి పోలీసులు కేసు నమోదు చేశారు.
కాంప్లెక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో సెక్షన్ 304 పార్ట్ 2, 324,420 ఐపీసీ , సెక్షన్ 9 (బి) పేలుడు పదార్థాల చట్టం, 1884 కింద కేసులు నమోదే చేసినట్టు పోలీసులు తెలిపారు.
భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమైన స్వప్పలోక్ ఎస్టాబ్లిమెంట్ అసోసియేషన్, కేడియా ఇన్ఫోటెక్ లిమిటెడ్,
వికాస్ పేపర్ ఫ్లెక్సో ప్యాకేజింగ్ లిమిటెడ్, క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేటు లిమిటెడ్ పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బాధితులకు న్యాయం చేస్తాం(CM Kcr)
ఈ ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటోంది.
ఫైర్ సేఫ్టీ పాటించాలని వ్యాపార సముదాయ నిర్వాహకులకు చెబుతున్నామని, అయినా ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు.
ఈ ప్రమాదంలో బయటికి రాలేక 6 మంది ఐదవ అంతస్తులోనే చిక్కుకుని మరణించిన సంగతి తెలిసిందే.
వారంతా క్యూనేట్ అనే సంస్థలో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఆ సంస్థపై ఫిర్యాదులు కూడా ఉన్నట్లు తెలిపారు.
ప్రభుత్వ సహాయం కాకుండా యూనిట్ నుంచి కూడా బాధితులకు సాయమందేలా చూస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.
ఈ అగ్ని ప్రమాదాలు అన్నీ 40 ఏళ్ల నాటివని.. ఈ క్రమంలో పాత బిల్డింగులు ఫైర్ సేఫ్టీ లేని భవనాలు సుమారుగా 30 లక్షల దాకా ఉన్నాయని తెలిపారు.