Home / Supreme Court
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుండి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. విడాకుల తర్వాత తన భార్యకు భరణం చెల్లించాలనే ఆదేశాలను సవాలు చేస్తూ ఒక ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చి ఈ తీర్పును వెలువరించింది.
నీట్ పేపర్ లీక్ ఘటనలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరుపుతోందని, దీనికి సంబంధించి పలు అరెస్టులు జరిగాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తన అఫిడవిట్లో తెలిపింది.
నీట్ పరీక్షల వివాదంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరీక్షల నిర్వహణలో 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా సహించమని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నాడు కేంద్రప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు పంపించింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గురువారం గ్రేస్ మార్కులు ఇచ్చిన 1,563 NEET-UG 2024 అభ్యర్థుల స్కోర్‌కార్డ్‌లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. NEET ఫలితాలపై సుప్రీంకోర్టులో విచారణ సందర్బంగా ఎన్ టీ ఏ ఈ విషయాన్ని తెలియజేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో నీటి కటకట తీవ్రంగా ఉంది. రాజధాని ప్రజలను మంచి నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. అదే సమయంలో ట్యాంకర్ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి.
ఢిల్లీలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయం ఖాళీ చేయడానికి సుప్రీంకోర్టు ఆగస్టు 10వ తేదీ వరకు గడువు పొడిగించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ఏరియాలో ఆప్ పార్టీ ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ వాదనలను సుప్రీమ్ కోర్ట్ తోసిపుచ్చింది .దీనితో సుప్రీంకోర్టులో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది . పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ వైసీపీ వేసిన కేసును సుప్రీం కోర్టు కొట్టేసింది
: ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఉన్నత న్యాయస్థానం తక్షణమే పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించింది. కాగా పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు బదిలీ చేశారు.
జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. అయితే ఆయన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థాన తిరస్కరించింది.
ఏపీలో ఇసుక మైనింగ్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టులోనూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది.