Home / Political News
ఏపీలో అన్న జగన్ మోహన్‌రెడ్డి అధికార సాధనకు భారీగా ప్రచారం చేసి, గెలిచాక విభేదించి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు షర్మిల.
దేశ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ మంత్రి కేటిఆర్ బహిరంగ లేఖ రాశారు. నమో అంటే నమ్మించి మోసం చేసేవాడని, రోజ్ గార్ మేళాతో తెలిసివచ్చిందన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలకంగా భావిస్తున్న మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లకుండా దూరంగా ఉంటున్న ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది.
మునుగోడు ఉప ఎన్నికలు రాజకీయ పార్టీల్లో అలజడి రేపుతుంది. ప్రధానంగా నగదు పంపిణీ, లోపాయికారి హామీలు, విచ్చల విడి మద్యం పంపిణీ అంశాలు మునుగోడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి. అధికార దాహంతో ఒకరైతే, అధికారం కోసం మరొకరు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన బీజేపీ నేతలు.
దీపావళిని ఏపి సీఎంతో పోలుస్తూ రాక్షస జాతిని గుర్తు చేశారు కాంగ్రెస్ నేత తులసీ రెడ్డి. మీడియాతో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. లాండ్, శాండ్ మైనింగ్ మాఫియాలు రాష్ట్రంలో ఎక్కువైనాయన్నారు. అనుకూల వాతావరణ పరిస్ధితి నేడు రాష్ట్రంలో లేదన్నారు.
మునుగోడు ఉపఎన్నికలు రోజురోజుకు కాక పుట్టిస్తున్నాయి. బైపోల్స్ దగ్గర పడుతున్న వేళ నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ఇంటిఇంటికి తిరుగుతూ ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు.
మహారాష్ట్ర శివసేన పార్టీలో ముసలం పెట్టిన భాజపా, అసమ్మతి వర్గానికి మద్దుతు ఇచ్చి ఏక్ నాధ్ షిండేకు అధికార పీఠం కట్టబెట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా ఉద్దవ్ శివసేన పార్టీకి చెందిన సామ్నా పత్రిక ఓ సంచలన రాజకీయ కధనాన్ని ప్రచురించింది.
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కన్జర్వేటివ్ పార్టీలో వాతావరణం వేడెక్కింది. ఆ పార్టీకి చెందిన 100 ఎంపీల మద్ధతు తనకు ఉందంటూ భారత మూలాలకు చెందిన రుషి సునాక్ వెల్లడించారు.
తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ జిల్లాల్లోని అధికార పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.