Last Updated:

YS Sharmila: మునుగోడుకు దూరంగా షర్మిల.. కారణమేమిటి?

ఏపీలో అన్న జగన్‌ మోహన్‌రెడ్డి అధికార సాధనకు భారీగా ప్రచారం చేసి, గెలిచాక విభేదించి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు షర్మిల.

YS Sharmila: మునుగోడుకు దూరంగా షర్మిల.. కారణమేమిటి?

Hyderabad: ఏపీలో అన్న జగన్‌ మోహన్‌రెడ్డి అధికార సాధనకు భారీగా ప్రచారం చేసి, గెలిచాక విభేదించి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టారు షర్మిల. తెలంగాణతో పెద్దగా సంబంధం లేకున్నా ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల తన దశ-దిశ లేని రాజకీయ ప్రయాణాన్ని చాటుతున్నారు. పాదయాత్ర అంటూ నిన్నమొన్నటి వరకు తిరిగిన ఆమె, కాళేశ్వరం పై ఫిర్యాదు అంటూ ఢిల్లీకి వెళ్లారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేశారు.

దేశవ్యాప్తంగా చర్చ రేపుతోంది మునుగోడు ఉప ఎన్నిక. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టీఆర్ఎస్ మునుగోడులో గెలుపు కోసం పోటీ పడుతూ ఖర్చుపెడుతున్నాయి. వీటి మధ్యలో నాయకులు, కార్యకర్తలను కోల్పోతూ కాంగ్రెస్ మిగిలిపోతోంది. అయినా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన వంతు పోరాటంతో కాంగ్రెస్‌ను పోటీలో నిలిపే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఏపీ సరిహద్దు జిల్లా కావడంతో సమీపంలోని నియోజకవర్గాల్లో అయితే వైఎస్ పై అభిమానం కనిపిస్తుంటుంది. దీంతోనే షర్మిల పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఓట్లు పడే వీలుంది. ఇదే సమయంలో వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీ పోటీ చేసి ఉంటే ఓ రాజకీయ పార్టీగా తన స్థాయి స్థానం ఏమిటో తెలిసేది.

కానీ షర్మిల పార్టీ పోటీకి దూరంగా ఉంటోంది. ఓ పార్టీ స్టాండ్ ఏమిటనేది ఎన్నికల సమయంలోనే తేలుతుంది. మునుగోడులో ఈ చాన్స్‌ను షర్మిల పార్టీ మిస్ చేసింది. అయితే అన్నిటికంటే మించి ఇప్పుడు మునుగోడులో ఎన్నికను బహిష్కరించాలంటూ షర్మిల ఓటర్లకు పిలుపునివ్వడం ఆశ్చర్యం కలిగించింది. అయితే, పార్టీ పెట్టాక వచ్చిన తొలి ఎన్నికను ఎవరైనా వదులుకుంటారా? షర్మిల గతేడాది తన పార్టీని ప్రారంభించారు. తెలంగాణలో పాదయాత్ర కూడా చేశారు. నిరుద్యోగ దీక్షలంటూ హడావుడి చేశారు. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలకు దిగారు. ఆ జోష్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తీరా, పార్టీ పెట్టాక తొలిసారి వచ్చిన ఎన్నికలో పోటీ చేయకుండా ఉండిపోయారు షర్మిల. ఆమె వ్యూహం ఏమిటో తెలియదు, కానీ, ఉప ఎన్నికకు దూరంగా ఉన్నారు. అయితే ఇక్కడో విషయం చర్చనీయాంశం అవుతోంది. షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి. కోమటిరెడ్డి కుటుంబానికి పొలిటికల్‌ గాడ్ ఫాదర్. ఆయన ప్రాపకంతోనే కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగారు.

ఈ నేపథ్యంలోనే షర్మిల పార్టీ బరిలో ఉంటే వైఎస్ అభిమానులు చీలిపోయి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రతికూలంగా మారుతుందన్న అభిప్రాయం ఉంది. ఇలాంటివారి సంఖ్య ఎంత ఉన్నది అన్నది కాదు. ఒక పార్టీ అంటూ బరిలో ఉంటే అప్పటి పరిస్థితి వేరుగా ఉంటుంది. వారికో అభ్యర్థి, గుర్తు, ప్రచారం, దాని ప్రభావం కనిపిస్తుంది. అసలు అభ్యర్థే లేకుంటే అదేమీ ఉండదు. రాజగోపాల్ రెడ్డికి ఫేవర్ చేసేందుకే వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల ఇలాంటివేమీ లేకుండా చేశారని రాజకీయంగా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి షర్మిల ఔదార్యం బీజేపీకి మోలు చేస్తుందా లేదా అన్నది చూడాలి.

ఇవి కూడా చదవండి: