Home / Pakistan
India Cancelled Pakistani’s Visas over Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి కలిచివేసింది. ఈ నేపథ్యంలో భారత్ మరో కఠిన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ పౌరులకు అన్ని వీసాలు రద్దు చేసింది. అనంతరం మరో 72 గంటల్లో భారత్ విడిచి పెట్టాలని పాక్ పౌరులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు మెడికల్ వీసాలను ఏప్రిల్ 29 వరకే అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా భారత పౌరులు పాకిస్థాన్ వెళ్లరాదని కేంద్రం సూచించింది. ఇదిలా ఉండగా, […]
Pakistan PM on Indus: కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై భారత్ సీరియస్ గా అడుగులు వేస్తుంది. ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్ కు తగినశాస్తి చేసేందుకు రెడీ అయ్యింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు పాకిస్థాన్ తో సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్ రానున్న రోజుల్లో తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కోనుంది. పాకిస్తాన్ ప్రధాని షెహనాజ్ షరీఫ్ భారత్ నిర్ణయాన్ని తప్నుబట్టారు. ఇది చట్ట విరుద్దమని అన్నారు. […]
Indian Navy successfully Tested fires missile INS Surat: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోగా.. పాక్ కవ్వింపుల చర్యలకు పాల్పడుతోంది. ఇరు దేశాలు వీసాల రద్దు వంటి ఆంక్షలను పోటాపోటీగా విధించుకుంటున్నాయి. అలాగే దేశ సరిహద్దుల్లో సైన్యం తరలిస్తుంది. తాజాగా, మిస్సైళ్ల ప్రయోగం అందరిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొల్పింది. ఇండియన్ నేవీ స్వదేశీ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్‌ను టెస్ట్ […]
BSF Jawan Arrested by Pakistan Rangers Mobile: భారత్, పాకిస్థాన్ మధ్య వివాదం ముదురుతోంది. పాకిస్థాన్ బందీగా భారత్ జవాన్‌ను అదుపులోకి తీసుకుంది. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్‌ను పాకిస్థాన్ బంధించింది. తమ భూభాగంలోకి ప్రవేశించాడని పాకిస్థాన్ ఆరోపిస్తుంది. అయితే అక్రమంగా బంధించారని భారత్ చెబుతోంది. పంజాబ్‌లోని ఫిరోజ్పూర్లో భారత్, పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను పాక్ బంధించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించడంతో అరెస్ట్ చేసినట్లు పాక్ ఆర్మీ చెబుతోంది. అయితే […]
BCCI Sensational Decision on Pakistan Cricket after Pahalgam Terror attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. పర్యాటక కోసం వెళ్లిన టూరిస్టులు చంపొద్దని ఎంత వేడుకున్నా మతం పేరు అడిగి మరి దారుణానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ […]
India has intensified diplomatic measures against Pakistan: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ఇండియాలోకి పాకిస్థానీయులకు ప్రవేశంపై నిషేధం విధించింది. సింధూ నది జలాల ఒప్పందాన్ని కూడా కేంద్రం నిలిపివేసింది. తాజాగా ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీచేసింది. బుధవారం అర్ధరాత్రి అనంతరం పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్‌ను పిలిచి ఆ దేశ మిలిటరీ దౌత్యవేత్తలకు […]
Pakistan : అఫ్గానిస్థాన్ నుంచి వచ్చి పాకిస్థాన్‌లో ఉంటున్న వారిపై ఇస్లామాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. 30 లక్షల మంది అఫ్గానీయులను తమ దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రాణాళికలు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అఫ్గాన్ నుంచి శరణార్థులుగా వచ్చినవారు తమ దేశం విడిచి వెళ్లడానికి ఇచ్చిన గడువు నేటితో ముగియడంతో ఈ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న అఫ్గానిస్థాన్ వాసులను, ఇతర విదేశీయులను తిరిగి పంపడానికి 2023 అక్టోబర్ […]
Pakistan Cricket Board Suffers Rs 869 Crore Loss In Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ మెగా టోర్నీ నిర్వహించడంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. ఎన్నో అవాంతరాలు, అనుమానాలు, అహకారంతో టోర్నీని నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దాదాపు రూ.869కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు పాకిస్తాన్ బోర్డు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. […]
Pakistan : పాక్‌లో సైనికులు ప్రయాణిస్తున్న మిలిటరీ వాహనంపై బాంబు దాడి జరిగింది. ఆదివారం బలూచిస్థాన్‌లోని నోష్కిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో 5 మంది సైనికులు మృతిచెందగా, 12 మందికి తీవ్ర గాయాలు అయినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ మేరకు అధికారులు విచారణ జరపగా, దర్యాప్తులో ఆత్మాహుతి దాడిగా గుర్తించారు. ఈ విషయాన్ని నోష్కి స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెల్లడించారు. మరోవైపు, ఈ పేలుడులో 90 మంది సైనికులను చంపినట్లు బలోచ్ లిబరేషన్ […]
Train Hijack Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్‌లో ట్రైన్ హైజాక్‌కు గురైన ఘటనలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ అదుపులో ఉన్న సైనిక బలగాలు సురక్షితంగా విడిపించాయి. మిలిటెంట్ల చెరలో తాము అనుభవించిన కష్టాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదులు ట్రైన్ ఇంజిన్ కింద పేలుడు పదార్థాలు అమర్చి పేల్చారు. దీంతో బోగీలు పట్టాలు తప్పినట్లు రైలు డ్రైవర్ అమ్జాద్ పేర్కొన్నాడు. రైలు ఆగిన వెంటనే ఉగ్రవాదులు కిటికీలను పగులగొట్టి ఆయుధాలతో బోగీల్లోకి చొరబడ్డారని […]