Home / Pakistan
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తన ప్రభుత్వం ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడానికి తక్కువ-ఆదాయ ప్రజలకు సబ్సిడీపై పెట్రోల్ అందించనున్నట్లు ప్రకటించారు.లీటరుకు 50 రూపాయల సబ్సిడీని ఉపశమన ప్యాకేజీలో భాగంగా ఇవ్వనున్నారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ)ని "నిషిద్ధ" సంస్థగా ప్రకటించాలని భావిస్తున్నట్లు పాకిస్తాన్ అంతర్గత మంత్రి రానా సనువల్లా చెప్పారు. దీనికోసం ప్రభుత్వం నిపుణులను సంప్రదిస్తుందని ఆయన పేర్కొన్నారు.
:నగదు కొరతతో ఉన్న పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ( ఐఎంఎఫ్) నుండి బెయిలౌట్ పొందడానికి కష్టపడుతో్ంది. ఈ నేపధ్యంలో ఐఎంఎఫ్ ముందుకు తెచ్చిన కొత్త షరతులు పాకిస్తాన్కు రుణ ఒప్పందాన్ని పొందడం మరింత కష్టతరం చేసే అవకాశం ఉంది.
పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం అధ్యక్షుడు, ప్రధాన మంత్రి మరియు క్యాబినెట్ సభ్యులతో సహా ఎన్నికైన అధికారులకు 300 డాలర్ల కంటే ఎక్కువ విలువైన తోషాఖానా బహుమతులను తీసుకోవడాన్ని నిషేధించింది. ఇది న్యాయమూర్తులు, సివిల్ మరియు మిలటరీ అధికారులకు కూడా వర్తిస్తుంది.
ఇస్లామాబాద్లోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు సోమవారం పిటిఐ ఛైర్మన్ ఇమ్రాన్ ఖాన్కు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. మహిళా అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి మరియు సీనియర్ పోలీసు అధికారులపై బెదిరింపు పదజాలం ఉపయోగించిన కేసులో ఈ వారెంట్ జారీ అయింది.
తోషాఖానా బహుమతులు చాలా కాలంగా పాకిస్థాన్ రాజకీయాల్లో వివాదాస్పద అంశంగా ఉన్నాయి. ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వం తోషాఖానా లేదా పాకిస్తాన్ ఖజానా రికార్డులను బహిరంగపరిచింది.
పాకిస్తాన్ ప్రస్తుతం పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
పాకిస్తాన్ మీడియా డాన్ నివేదిక ప్రకారం, ఐదు నెలల్లో మొదటిసారిగా పాకిస్తాన్లో వారపు ద్రవ్యోల్బణం 40 శాతానికి పైగా పెరిగింది.
ఆర్థికంగా దివాలా అంచున ఉన్న పాకిస్తాన్ కొన్ని దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. మంత్రులు విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు బిజినెస్ క్లాస్లో కాకుండా ఎకనమి క్లాస్లో ప్రయాణించాలని, అలాగే విదేశాలకు వెళ్లినప్పడు ఫైవ్ స్టార్ హోటల్స్లో కాకుండా సాధారణ హోటల్లో దిగాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తన మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేసింది.
బాలీవుడ్ గేయ రచయిత మరియు రచయిత జావేద్ అక్తర్ ఇటీవల పాకిస్థాన్లోని లాహోర్లోని ఫైజ్ ఫెస్టివల్ 2023కి హాజరయ్యారు. ప్రముఖ ఉర్దూ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది,