Home / national news
ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. కాంకేర్ జిల్లాలోని సిక్సోడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కడ్మే శివారు అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
కేరళలో తనతో విడిపోవడానికి నిరాకరించినందుకు తన 23 ఏళ్ల యువకుడికి విషమిచ్చి చంపిన యువతి తరువాత పోలీస్ స్టేషన్లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.
పాఠశాలలో ప్రదర్శించబోయే ఫ్రీడం ఫైటర్ భగత్ సింగ్ నాటకం ఆ విద్యార్థి పాలిట శాపంగా మారింది. రిహార్సల్స్ కాస్త అతన్ని తిరిగిరాని లోకాలకు చేర్చాయి. ఈ హృదయ విదారకరమైన ఘటన కర్ణాటకలో నెలకొంది.
ఒక 12 ఏళ్ల కుర్రాడు తనను పాము కాటేసిందని దానిపై కోపంతో ఊగిపోయాడు. అక్కడి నుంచి జరజరా పాకుతూ వెళ్లిపోతున్న ఆ పామును పట్టుకుని తన పంటితో కసితీరా కొరికేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాము కాటేసిన బాలుడు మరణించలేదు కానీ బాలుడు కొరికిన పాము మాత్రం మరణించింది. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందో ఈ కథనం ద్వారా చూసెయ్యండి.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కి సాయం చేసి తప్పు చేశానని, ఆ సమయంలో తాను కాంగ్రెస్ కి సాయం చేసి ఉండాల్సిందని పేర్కొన్నారు.
గుజరాత్ లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలోరాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కుందారియా కుటుంబ సభ్యులు 12 మంది ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
ఓ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ ల్యాప్‌టాప్ చోరీ చేశాడు. అంతవరకు బాగానే ఉన్నా ఏమనుకున్నాడో ఏమోకానీ ఆ దొంగ ఇంటికెళ్లి "మరోదారి లేక దొంగతనం చేశానంటూ క్షమాపణ మెయిల్ పెట్టాడు". లాప్‌టాప్‌లోని ముఖ్యమైన ఫైల్స్‌ను సదరు ల్యాప్ టాప్ యజమానికి పంపించాడు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.
అత్యాచారం కేసుల్లో రెండు వేళ్ల పరీక్ష ను నిషేధించాలని సోమవారం సుప్రీంకోర్టు ఆదేశించింది.
మరమ్మత్తులు చేసిన 5రోజుల్లోనే పురాతన వంతెన కూలిపోవడం పై మాజీ సుప్రీకోర్టు, లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.