Home / latest Telangana news
ఖమ్మం-నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్హ కొనసాగుతోంది. పట్ట భద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి.. సాయంత్రం 4 గంటల వరకు ఈసీ అవకాశం కల్పించింది.
మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద భారీ శబ్దాలు, ప్రకంపనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి పతాకశీర్షికల్లో ఉంటోన్న మేడిగడ్డ ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎల్ అండ్ టీ సిబ్బందితో కలిసి నీటిపారుదల శాఖ అధికారులు 7వ బ్లాక్‌లోని 15వ గేటును ఇటీవల ఎత్తారు.
జీహెచ్ఎంసీ లో మహిళా కార్మికులపై అకృత్యాలకు పాల్పడిన గాజులరామారం సర్కిల్ లోని శానిటేషన్ ఫీల్ట్ అసిస్టెంట్ కిషన్ ను డిస్మిస్ చేసారు . అతను చేసిన కీచకపర్వం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తీవ్రంగా పరిగణించి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసారు
భద్రాచలం మారుతి పారా మెడికల్ నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. నర్సింగ్ విద్యార్థిని కారుణ్య అనుమానాస్పద మృతికి నిరసనగా.. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నిన్న హాస్టల్ బాత్రూమ్లో తీవ్ర గాయాలతో పడి ఉన్న కారుణ్యను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
అంతర్జాతీయ కిడ్నీ రాకెట్ సూత్రధారి గుట్టు రట్టైంది. కొచ్చి విమానాశ్రయంలో పట్టుబడ్డ సబిత్ నాసిర్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు దళారులు ఈ రాకెట్‌ను నడిపించారని.. అందులో ఒక వైద్యుడు ఉన్నాడని తేలింది.
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ బూస్దాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కవిత జైలు కు వెల్లిందని , తమ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్టేషన్ లో కేటీఆర్ ఉన్నారని అన్నారు.
టీఎస్ ఆర్టీసీ.. టీజీఎస్ ఆర్టీసీగా మార్చింది. ఈ మేరకు టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీగా మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్‌కి బదులు టీజీగా పేర్కొనాలని ఆదేశించింది.
హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. దీంతో ఉమామహేశ్వరరావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.
ఉమామహేశ్వరరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం నుంచి ఉమా మహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఉమా మహేశ్వరరావుకు సంబంధించిన 17 ప్రాపర్టీలను అధికారులు గుర్తించారు. శామీర్ పేటలో ఒక విల్లా, ఘట్ కేసర్లో 5 ప్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 8 గంటలకు విఐపీ బ్రేక్ దర్శనంలో రేవంత్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.