Home / latest Telangana news
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ జరిగింది. రెండు పార్టీలు చెరో 8 సీట్లను గెలుచుకోగా మజ్టిస్ హైదరాబాద్ సీటును నిలుపుకుంది. రెండు పార్టీలకు గత పార్లమెంటు ఎన్నికల్లో పోల్చినపుడు సీట్లు పెరగడం విశేషం. మరోవైపు పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారం చలాయించిన బీఆర్ఎస్ ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది.
ఇటీవల కాలంలో అమెరికాలో ఇండియన్స్ స్టూడెంట్స్ మిస్సింగ్ కేసులు విపరీంగా పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్కు చెందిన 23 ఏళ్లి నితీషా కందులా మే 28 నుంచి కనిపించకుండా పోయారు. కాగా ఆమె కాలిఫోర్నియా యూనివర్శిటీ సాన్ బెర్నారిడో స్టూడెంట్. ఆమె ఆచూకీకి సహకరించవలసింది పోలీసులు కూడా కోరారు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తెలంగాణకు చెందిన ఒక కాంగ్రెస్ నేత గుడి కట్టించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ నేవూరి మమత-వెంకట్రెడ్డి దంపతులు సోనియాగాంధీకి పాలరాతితో గుడి కట్టించారు.
తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.. బీఆర్ఎస్ సున్నా లేదా ఒకటి మాత్రమే గెలుచుకోవచ్చునని ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. హైదరాబాద్ స్థానాన్ని ఎప్పుడూ మాదిరిగానే మజ్లిస్ చేజిక్కించుకుంటుందని వివిధ సర్వే సంస్దలు అంచనా వేసాయి
గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. ఈ కుంభకోణం విలువ సుమారు రూ.700 కోట్లు ఉంటుందని ఏసీబీ దర్యాప్తులో తెలింది.
సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దైంది. అనారోగ్య కారణాలతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా హాజరు కావడం లేదని ఏఐసీసీ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం రేపు హైదరాబాద్కు సోనియా గాంధీ రావాల్సి ఉంది. అయితే.. అనారోగ్యం కారణంగా రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో తెలంగాణ పర్యటనను సోనియా రద్దు చేసుకున్నారు.
కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ సతీమణి లక్ష్మీ బాయి (94) గురువారం ఉదయం కన్ను మూశారు. శివశంకర్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు 1979 ఉప ఎన్నికల్లో ,1980 సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు .
తెలంగాణ రాష్ర్ట అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ బొమ్మను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుండటంపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. తన పోస్ట్ కు రెండు చార్మినార్ ఫొటోలను జత చేశారు.
తెలంగాణలో విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జనుము, జీలుగ, పత్తి విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నిన్నటిదాకా గోస పడ్డ రైతులు.. నేడు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు