Last Updated:

Telangana Rains: తెలంగాణలో పలు చోట్ల వర్షాలు.. 13 మంది మృతి

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వేర్వేరు ఘటనల్లో 13 మంది మృతి చెందారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.

Telangana Rains: తెలంగాణలో పలు చోట్ల వర్షాలు.. 13 మంది మృతి

Telangana Rains: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వేర్వేరు ఘటనల్లో 13 మంది మృతి చెందారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.

నాగర్‌కర్నూల్ జిల్లాలో..(Telangana Rains)

పెనుగాలుల తాకిడికి చెట్లు నేలకూలాయి, విద్యుత్ మరియు కమ్యూనికేషన్ టవర్లు దెబ్బతిన్నాయి. రవాణా మరియు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.ఒక్క నాగర్‌కర్నూల్ జిల్లాలోనే ఏడుగురు చనిపోయారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నలుగురు, మెదక్‌లో ఇద్దరు మరణించారు.నాగర్‌కర్నూల్, మెదక్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులు విధ్వంసం సృష్టించాయి.నాగర్‌కర్నూల్ జిల్లా తాండూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న పౌల్ట్రీ షెడ్డు కూలిపోవడంతో తండ్రీకూతుళ్లతో సహా నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో రైతు మల్లేష్ (38), అతని కుమార్తె అనూష (12), భవన నిర్మాణ కార్మికులు చెన్నమ్మ (38), రాముడు (36) మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. అదే జిల్లాలో మరో ముగ్గురు మృతి చెందారు. పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.
హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేట వద్ద మోటార్‌సైకిల్‌పై వెళుతుండగా చెట్టు విరిగిపడి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతులు ధనంజయ్ (44), నాగిరెడ్డి రామిరెడ్డి (56)గా గుర్తించారు.
హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట ప్రాంతంలో ఈదురు గాలులకు ఇరుగుపొరుగు ఇంటి పైకప్పు ఇటుకలు పడడంతో మహమ్మద్ రషీద్ (45), మహ్మద్ సమద్ (3) మృతి చెందారు.

మహబూబ్‌నగర్, జోగులాంబ-గద్వాల్, వనపర్తి, యాదాద్రి-భోంగిర్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి గాలులు తోడవడంతో ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ లైన్లు తెగిపోవడం, చెట్ల కొమ్మలు విద్యుత్‌ తీగలపై పడడం, స్తంభాలు దెబ్బతినడం, నేలకూలడం వంటి కారణాలతో చాలా చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.హోర్డింగ్‌లు, సెల్ టవర్లు, శిథిలాలు కూడా కొన్ని చోట్ల రోడ్లు, ఇళ్లపై పడ్డాయి.

ఇవి కూడా చదవండి: