Home / latest Telangana news
కేంద్ర మాజీ మంత్రి పుంజాల శివశంకర్ సతీమణి లక్ష్మీ బాయి (94) గురువారం ఉదయం కన్ను మూశారు. శివశంకర్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడు 1979 ఉప ఎన్నికల్లో ,1980 సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు .
తెలంగాణ రాష్ర్ట అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ బొమ్మను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుండటంపై మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ ప్రభుత్వ చర్యను తప్పుబట్టారు. తన పోస్ట్ కు రెండు చార్మినార్ ఫొటోలను జత చేశారు.
తెలంగాణలో విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జనుము, జీలుగ, పత్తి విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తెలంగాణ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి నిన్నటిదాకా గోస పడ్డ రైతులు.. నేడు విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారని పేర్కొన్నారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో సంచలనం బయటపడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ పాత్రను ఈడీ వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి కేసీఆర్‌కు ముందే తెలుసని ఈడీ చెప్తోంది. ఢిల్లీ హైకోర్టులో ఈడీ వాదనల సందర్భంగా అధికారులు కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి రాధాకిషన్ స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. గతంలో బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్‌ను ప్రభాకర్ రావు ట్యాప్ చేశాడు.
బ్యాంక్ రుణం కావాలంటే అధికారులు పలు షరతులు విధిస్తారు. అవసరమైన డాకుమెంట్స్ అన్నీ అందించాలని కోరుతారు. ఆ తర్వాత వెరిఫికేషన్ పూర్తి చేసి లోన్ మంజూరు చేస్తారు. కానీ అందుకు విరుద్ధం గా మృతి చెందిన వ్యక్తికి బుల్లెట్ బండికి కొటాక్ మహీంద్రా బ్యాంక్ లోన్ మంజూరు చేసింది. ఈఎమ్ఐ చెల్లించాలని ఖమ్మం బ్రాంచ్ కు చెందిన బ్యాంక్ అధికారులు ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కొరకు అమెరికా వెళ్లిన యాదగిరిగుట్టకు చెందిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాద్గిరిపల్లి గ్రామానికి చెందిన సౌమ్యనిన్న రాత్రి కూరగాయలు తీసుకొని తిరిగి ఇంటికొస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టడంతో సౌమ్య స్పాట్లోనే చనిపోయింది.
రాయల కాలంలో రాయలసీమ రతనాల సీమగా ఒక వెలుగు వెలిగింది . ఇప్పుడు రాయల సీమ నిజంగా రతనాల సీమ మాదిరిగానే మారుతుంది . మట్టిలో మాణిక్యాలు వుంటాయని సామెత .రాయలసీమ మట్టిలో నిజంగానే వజ్రాలు దొరుకుతున్నాయి .
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వేర్వేరు ఘటనల్లో 13 మంది మృతి చెందారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.