Home / Latest News
పాకిస్తాన్లో మైనారిటీ హిందూ, సిక్కుల బాలికలకు భద్రత లేకుండా పోతోంది. మైనారిటి కూడా తీరని బాలికలను వారి ఇంటి నుంచే బలవంతంగా ఎత్తుకుపోయి.. మతం మార్పిడి చేయించి బాలికలకంటే రెండు, మూడు రెట్లు ఎక్కువ వయసు ఉన్న వారితో పెళ్లిళ్లు చేయించడం సర్వసాధారణంగా మారిపోయింది.
బీహార్‌లోని బిజెపి ఎమ్మెల్యే లాలన్ పాశ్వాన్ హిందువుల విశ్వాసాలు, హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు
కరోనా ప్రభావం తగ్గిందనుకున్న ప్రతీ సారీ నేనున్నానంటూ ఎక్కడో దగ్గర తన ఉనికి చాటుకుంటూనే ఉంది కొవిడ్-19. కరోనా మరోసారి దాని విజృంభణను కొనసాగిస్తోంది. కరోనా వేరియంట్లలో అత్యంత ప్రమాదరక, వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్ఎక్స్ బీ వేరియంట్‌ను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సత్య దీక్షలు ఈనెల 21వ తారీకు నుంచి ప్రారంభం కానున్నాయి. మరి ఈ సత్య దీక్ష యొక్క విధివిధానాలు, నిత్య పూజావిధానము, భక్తులకు మరియు దీక్ష దారులకు తెలియజేసేలా రచించిన సత్య దీక్ష వ్రతకల్పం అనే పుస్తకాన్ని రచించారు.
కూలర్‌ను ఎందుకు ఆఫ్ చేశారని అడిగినందుకు అక్కడి మహిళ ఓ వ్యక్తిపై చెప్పుతో దాడి చేసింది. అతన్ని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తన్ని తరిమేసింది. ఈ ఘటన అంబికాపూర్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
పెళ్లి అనగానే సాధారణంగా కట్నం ఎంత అని అడుగుతుంటారు. వధువు కుటుంబ సభ్యులు వరుడికి కట్నకానుకలు సమర్పించడం అనాది కాలంగా వస్తోన్న ఆచారం. ఎవరి స్థాయికి తగినట్టుగా వారు వరుడికి వివిధ వస్తువులు, నగదు, బంగారం రూపేణా కట్నాలు సమర్పించుకుంటారు. అయితే ఒక ప్రాంతంలో వింత ఆచారం కొనసాగుతుంది వరుడికి కట్నం కింద వారు పాములు ఇస్తున్నారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.
గతంలో ఎన్నడూ లేని విధంగా బెంగళూరును వర్షాలు ముంచెత్తాయి. ఐటీ నగరి, కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు ఇటీవల కురిసిన వర్షాల ధాటికి నీటమునిగింది. దానితో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కకుని ఉన్నాయి.
నేటి యువత కళాశాలకు వెళ్లాలంటే అబ్బో మాములుగా రెడీ అవుతారా చెప్పండి. దువ్విన తలనే దువ్వడం అద్దిన పౌడర్ అద్దడం అద్దం వదలకపోవడం ఈపాట గుర్తొస్తుంటది వీళ్లు కాలేజీలకు వెళ్లేటప్పుడు స్టంట్స్ చూస్తుంటే.. కానీ ఈ యువకుడు మాత్రం అందుకు భిన్నం అని చెప్పవచ్చు.
రక్తాన్ని ఇవ్వడానికి సోమవారం జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్‌కు ఆమె వెళ్లింది.అక్కడ ఉన్న అధికారులను కలిసి డబ్బులు ఇస్తేనే రక్తం ఇస్తానని చెప్పింది.దీంతో ఆందోళన చెందిన బ్లడ్ బ్యాంక్ అధికారులు చైల్డ్‌లైన్ ఇండియాకు సమాచారాన్ని అందించారు.జిల్లా శిశు సంక్షేమ కమిటీ సహకారంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఆమెను అప్పగించి కౌన్సెలింగ్ చేశారు.
ఖాట్మాండ్ లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. నేపాల్-చైనా సరిహద్దులోని సింధుపాల్ చౌక్ జిల్లాలో మద్యాహ్నం 2.52గంటలకు ఈ భూకంపం చోటుచేసుకొనింది. నేపాల్ కు 53 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగిన్నట్లు తెలుస్తుంది.