Home / Latest News
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది.
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల క్యాసినో, వన్యప్రాణుల పెంపకంతో వార్తల్లో కెక్కిన చీకోటి ప్రవీణ్ రాజా సింగ్ ను కలిసారు. రాజాసింగ్ జైలు నుంచి విడుదలయిన తరువాత కోర్టు ఆదేశాల మేరకు సైలెంట్ గా ఉన్నారు.
ఇరాన్లో మత గురువులు ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలదీస్తున్నారు మహిళలు. మూటముల్లె సర్దుకొని దేశం విడిచిపోవాల్సిందిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీ వల్ల దేశం పూర్తిగా నాశనమైపోయిందని శాపనార్థాలు పెడుతున్నారు. తలపాగాతో కనిపించే ముస్లిం మత గురువుల పాగాలను లాగేస్తున్న వీడియోలు షోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వాతావరణ కాలుష్యం తగ్గించడానికి యూఎన్ క్లయిమేట్ సమ్మిట్ ఈజిప్టులో జరుగుతోంది. ఈ సమ్మిట్ ఈజిప్టులోని బీచ్ రిసార్ట్ ప్రాంతమైన షార్మ్ ఎల్ షేక్‌లో జరుగుతోంది. ఈ సదస్సులో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో శాస్ర్తవేత్తలు సూచిస్తారు.
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో కనుగొనబడిన 'శివలింగం' పరిరక్షణ కోసం గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం పొడిగించింది.
తెలంగాణలోని గ్రానైట్ కంపెనీ కార్యాలయాలు, యజమానుల ఇళ్లపై జరిపిన సోదాల్లో రూ. 1.08 కోట్లు స్వాధీనం చేసుకొన్నామని ఈడీ అధికారులు తెలిపారు. పదేళ్లకు సంబంధించిన లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకొన్నామన్నారు. సోదాల్లో పలు విషయాలు బయటపడ్డాయన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే మంత్రికి లేఖ వ్రాశారు. కుప్పంలో వందే భారత్ రైలుకు స్టాపింగ్ ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు.
సానియా మీర్జా మరియు షోయబ్ మాలిక్ విడిపోయారనే వార్తల మధ్య, ఆయేషా ఒమర్ అనే పాకిస్థాన్ నటి చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌పై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నిందితులు రూ.1.20 కోట్ల విలువైన 140 ఫోన్లను మార్చి సాక్ష్యాలను ధ్వంసం చేసి అరెస్టు నుంచి తప్పించుకున్నారని ఆరోపించింది.