Delhi Excise Policy Scam : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు 140 ఫోన్లను మార్చిన నిందితులు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌పై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నిందితులు రూ.1.20 కోట్ల విలువైన 140 ఫోన్‌లను మార్చి సాక్ష్యాలను ధ్వంసం చేసి అరెస్టు నుంచి తప్పించుకున్నారని ఆరోపించింది.
Delhi Excise Policy Scam : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌పై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)నిందితులు రూ.1.20 కోట్ల విలువైన 140 ఫోన్‌లను మార్చి సాక్ష్యాలను ధ్వంసం చేసి అరెస్టు నుంచి తప్పించుకున్నారని ఆరోపించింది. ఇందులో 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని కూడ పేర్కొంది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ, 2021-22లో ఎంపిక చేసిన వ్యాపార గ్రూపులకు అనుచిత ప్రయోజనాల కోసం ముందస్తుగా రూ.100 కోట్ల లంచాలు ఇచ్చినట్లు పలువురు వ్యక్తులు వెల్లడించారు. ఢిల్లీలో రిటైల్ షాపులను తెరిచేందుకు ఢిల్లీలోని ఎక్సైజ్ అధికారులు లంచాలు డిమాండ్ చేసి తీసుకున్నట్లు కూడా వెల్లడయింది. ఈ కాలంలో డిజిటల్ సాక్ష్యాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ కేసులో అనుమానిత వ్యక్తులు పెద్ద సంఖ్యలో మొబైల్ ఫోన్‌లను మార్చారని దర్యాప్తు సంస్థ తన పత్రాల్లో ఆరోపించింది.
వీరిలో ప్రధాన నిందితులు, మద్యం వ్యాపారులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, ఢిల్లీ ఎక్సైజ్ మంత్రి మరియు ఇతర అనుమానితులందరూ ఉన్నారు. స్కామ్ బయటపడిన తర్వాతే ఈ ఫోన్‌లు ఎక్కువగా మార్చబడ్డాయని ఫోన్లను మార్చిన సమయం సూచిస్తుందని ఈడీ ఆరోపించింది.