Home / Latest News
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి తమ ముందు విచారణకు హాజరుకావాలని మల్లారెడ్డి సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ విచారణకు ఆయన దూరంగా ఉన్నారు.
లంగాణలో మాంసం వినియోగం విపరీతంగా పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో అత్యధికంగా మాంసాహారం వినియోగిస్తున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
ఐపీఎల్ నిర్వహణ సంస్థ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ను సాధించింది. బీసీసీఐ నిర్వహించిన ఓ టీ20 మ్యాచ్ కు అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరుకావడం వల్ల గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది.
తెలంగాణలోని మరో రెండు చారిత్రక కట్టడాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణంలో ఉన్న గోల్కొండ మెట్ల బావి, కామారెడ్డి జిల్లాలోని దోమకొండ కోటకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డులు లభించాయి.
సినిమా పరిశ్రమలో హీరోలు, దర్శకులు, నిర్మాతల వారసులు తెరంగేట్రం చేస్తూ అభిమానులను మన్ననలు పొందుతున్నారు. ఇకపోతే టాలీవుడ్ లో చాలా కాలంగా వారసుల హవా నడుస్తూనే ఉంది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ వచ్చే ఏడాది తెరంగేట్రం చేయనున్నట్ట స్వయానా బాలకృష్ణనే వెళ్లడించారు.
మెట్రో ప్రయాణికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రెండో ఫేజ్ పనులకు సంబంధించి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు.
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ ఎప్పటికపుడు సరికొత్త లుక్‌లో కనిపిస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. తాజాగా ఈ మెగా పవర్ స్టార్ ఓ న్యూ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు.
ఈ తరం ప్రేమకథతో రూపొందించబడిన లవ్ టుడే సినిమా విజయవంతంగా థియేటర్లలో నడుస్తోంది. సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న లవ్‌టుడే సినిమా అప్పుడే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లవ్‌టుడే డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది.
ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని భగీరథ్ ప్యాలెస్ మార్కెట్లోని దుకాణాలలో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 200 దుకాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణహాని జరుగులేదు కానీ 400 కోట్లకుపైగా ఆస్తి నష్టం సంభవించిందని వ్యాపారులు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం నుంచి నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేయనున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు పాదయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు 114 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.