Home / Latest National nerws
నీట్ పేపర్ లీక్ ఘటనలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణ జరుపుతోందని, దీనికి సంబంధించి పలు అరెస్టులు జరిగాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తన అఫిడవిట్లో తెలిపింది.
121 మంది మరణించిన హత్రాస్ విషాద ఘటన నేపధ్యంలో దీనికి కారణమయిన భోలే బాబా గురించి పలు ఆసక్తికరమైన వార్తలు వెలుగు చూసాయి. ప్రజలచేత దేవుడిగా కొలవబడే, లక్షలాది మంది అనుచరులు కలిగిన ఈ బాబా చాలా విలాసవంతమైన జీవనాన్ని గడుపుతున్నట్లు తెలుస్తోంది
మధ్యప్రదేశ్‌లో గత మూడేళ్లలో 31,000 మంది మహిళలు మరియు బాలికలు అదృశ్యమయ్యారని అధికారిక సమాచారం ద్వారా వెల్లడయింది. 2021 మరియు 2024 మధ్య రాష్ట్రంలో మొత్తం తప్పిపోయిన వారిలో 28,857 మంది మహిళలు, 2,944 మంది బాలికలు ఉన్నారు.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ తన దైన శైలిలో సెటైర్లు వేసారు. మంగళవారం లోక్ సభలో ప్రసంగిస్తూ 'షోలే' సినిమాలో డైలాగ్ ను ఉదహరిస్తూ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేసారు.పార్లమెంటు ఎన్నికల్లో 99 సీట్లు గెలిచి తాను ఏదో సాధించానన్న భావనలో కాంగ్రెస్ ఉందని అన్నారు.
సోమవారం లోక్హ సభలో తన ప్రసంగంలోని భాగాలు మరియు భాగాలను తొలగించిన విధానం పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు రికార్డుల నుండి తొలగించబడిన వ్యాఖ్యలను పునరుద్ధరించమని అభ్యర్దిస్తున్నానని కోరారు
ఢిల్లీ పోలీసులు సోమవారం, జూలై 1న కమలా మార్కెట్ ప్రాంతంలో వీధి వ్యాపారిపై భారతీయ న్యాయ సంహిత నిబంధనల ప్రకారం మొదటి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.మూడు కొత్త క్రిమినల్ చట్టాలు సోమవారం అమలులోకి వచ్చాయి.
నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ శనివారం గుజరాత్‌లోని ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆనంద్, ఖేడా, అహ్మదాబాద్ మరియు గోద్రా జిల్లాల్లో విస్తరించి ఉన్న అనుమానితుల ప్రాంగణంలో ఉదయం ఆపరేషన్ ప్రారంభించినట్లు వారు తెలిపారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్‌కు అవకాశాం ఇవ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను వొక్కలిగ మఠం పీఠాదిపతి చంద్రశేఖర స్వామిజీ అభ్యర్థించారు. ఒక కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్యతో వేదిక పంచుకున్న సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు
లోక్‌సభలో స్పీకర్ కుర్చీ పక్కన ఏర్పాటు చేసిన 'సెంగోల్' ఔచిత్యాన్ని సమాజ్ వాదీ పార్టీకి చెందని ఎంపీ ప్రశ్నించడంతో బీజేపీ ఎదురుదాడికి దిగింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్కె చౌదరి స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖలో 5 అడుగుల పొడవున్నబంగారు పూతతో కూడిన 'సెంగోల్' స్దానంలో రాజ్యాంగ ప్రతిని తప్పనిసరిగా ఉంచాలని అన్నారు.
బీహార్‌లో నీట్-యుజి పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం , పాట్నాకు చెందిన మనీష్ ప్రకాష్ మరియు అశుతోష్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మొదటి అరెస్టులు ఇవే కావడం గమనార్హం.