Home / Latest Nartional News
2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 686 కోట్లుగా ఉన్న భారత రక్షణ ఎగుమతులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 16,000 కోట్లకు ఎగబాకాయి. 100కి పైగా సంస్థలు తమ ఉత్పత్తులను 85 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయడంతో ఎగుమతులు 23 రెట్లు పెరిగాయి
పశ్చిమ బెంగాల్లో సాగర్డిఘి అసెంబ్లీ స్దానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే బేరాన్ బిస్వాస్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. మూడు నెలల ఊహాగానాల తర్వాత, పుర్బా మేదినీపూర్‌లోని ఘటోలాలో సోమవారం జరిగిన వేడుకలో ఆయన అధికారికంగా పార్టీలో చేరారు
ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ కొనుగోళ్ల ఒప్పందంలో అవినీతి ఆరోపణలపై బ్రిటిష్ ఏరోస్పేస్ కంపెనీ రోల్స్ రాయిస్, దాని ఎగ్జిక్యూటివ్‌లు మరియు ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్తలపై సీబీఐ సోమవారం కేసు నమోదు చేసింది.
మే 30తో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలోప్రధానికి 9 ప్రశ్నలు లేవనెత్తాలనుకుంటున్నట్లు కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది.ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ మాట్లాడుతూ ఈ ప్రశ్నలపై ప్రధాని మౌనం వీడాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు.
మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కొంటూ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం సప్ధర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. కస్టడీలో సత్యేందర్ జైన్ ఏకంగా 35 కిలోల బరువు తగ్గారని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు.
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఫిర్యాదు చేసిన బాలికలందరూ నార్కో పరీక్ష చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని రెజ్లర్ వినేష్ ఫోగట్ తెలిపారు. బ్రిజ్ భూషణ్‌కి నేను చెప్పాలనుకుంటున్నాను.నేను మాత్రమే కాదు, ఫిర్యాదు చేసిన అమ్మాయిలందరూ నార్కో పరీక్ష చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మంగళవారం భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అయిన తన భార్య రివాబాతో కలిసి న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసాన్ని జడేజా సందర్శించాడు
ఉద్యోగం కోసం భూమి కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకులు కిరణ్ దేవి మరియు ప్రేమ్ చంద్ గుప్తాకు చెందిన అనేక రాష్ట్రాల్లోని తొమ్మిది ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్ చొరవకు ప్రోత్సాహకంగా, ఐఎన్ఎస్ మోర్ముగో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షను ఆదివారం విజయవంతంగా నిర్వహించింది.మోర్ముగో మరియు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి, రెండూ దేశీయంగా అభివృద్ధి చేయబడ్డాయి.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) సీనియర్ నాయకుడు మరియు కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి బుధవారం తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రశంసలు కురిపించారు, ఆమె భారత ప్రధాని అయి ఉండాల్సిందని అన్నారు.