Home / Latest Nartional News
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో దెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును రెండవ అనుబంధ చార్జీషీటులో నమోదు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన మూడవ చార్జిషీటులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుని ఈడీ మరోసారి ప్రస్తావించింది. ఈసారి ఈడీ మరికొన్ని కీలక అంశాలని బయటపెట్టింది. 2023 మార్చి 28న కవిత పిఎ బుచ్చిబాబు ఇచ్చిన వివరాలని చార్జిషీట్లో ఈడీ పొందు పరిచింది.
హర్యానాకు చెందిన 90 శాతం మంది అథ్లెట్లు మరియు వారి సంరక్షకులు తమను విశ్వసిస్తున్నారని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ మరియు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.
బీహార్ లో మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ ను జైలు నుంచి విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దివంగత ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్య భార్య శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నితీష్ కుమార్ ప్రభుత్వం జైలు నిబంధనలను మార్చి ఆనంద్ మోహన్ ను రిలీజ్ చేయడాన్ని పలు రాజకీయపార్టీలు, సివిల్ సర్వీస్ అధికారులు తప్పు బట్టిన విషయం తెలిసిందే.
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయ తలుపులు గురువారం తెరుచుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తరపున మొదటి పూజ చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది.ఉదయం 7:10 గంటలకు ఆలయాన్ని తెరవడాన్ని చూసేందుకు వేలాది మంది యాత్రికులు తేలికపాటి మంచు మరియు వర్షం మధ్య పుణ్యక్షేత్రానికి తరలివచ్చారు.
బీహార్ లో మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌ను విడిపించే జైలు నిబంధనలను సర్దుబాటు చేయడానికి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న చర్యపై సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అధికారుల అసోసియేషన్ తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది, ఇది న్యాయ నిరాకరణతో సమానం అని పేర్కొంది.
పదకొండవ జ్యోతిర్లింగమయిన కేదార్నాథ్ ఆలయం తలుపులు మంగళవారం ఉదయం పూజలతో తెరవబడ్డాయి.ఈ మందిరంలో మొదటి పూజను ప్రధాని నరేంద్ర మోదీ పేరిట చేశారు.
బీహార్‌లో రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్, త్వరలో జైలు నుండి విడుదల కానున్నారన్న వార్త కలకలం రేపింది, తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లో క్రియాశీలకపాత్ర పోషించడానికి సిద్ధంగా ఉన్నానని సింగ్ స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ లో హత్యకు గురైన మాఫియా-రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ కార్యాలయం లోపల రక్తపు మరకలను ప్రయాగ్‌రాజ్ పోలీసులు కనుగొన్నారు. మెట్లపై, అతిక్ కార్యాలయంలోని సోఫాపై ఉంచిన తెల్లటి గుడ్డ ముక్కపై రక్తపు మరకలు కనిపించాయి. ఘటనా స్థలం నుంచి కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేరళ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీపై ఆత్మాహుతి బాంబు దాడి చేస్తామని బెదిరిస్తూ లేఖ రాసిన వ్యక్తిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. జేవియర్ అనే వ్యక్తి కొచ్చి నివాసి. అతను నగరంలో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు కేరళ పోలీసులు తెలిపారు.