Home / Latest Nartional News
ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద నదీ ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఉధృతంగా ప్రవహిస్తున్న యమునా నది నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. యమునా నది నీటి మట్టం 207.62 మీటర్లుగా నమోదయింది. ఇప్పటికీ ప్రమాద స్థాయి కంటే ఎక్కువగా ఉంది. ఉదయం 11 గంటలకు యమునా నది నీటిమట్టం 207.43 మీటర్లుగా నమోదైంది.యమునా నది నుండి నీరు నగరంలోకి రావడం ఆగిపోయింది. దీనితో నగరంలోని కీలక ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోయింది.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో జూలై 7 మరియు జూలై 15 మధ్య 300 కంటే ఎక్కువ మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరియు 406 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఫ్రాన్స్‌కు బయలుదేరి వెళ్లారు. మోదీ రెండు రోజుల పాటు (జూలై 13 మరియు జూలై 14) ఫ్రాన్స్ లో పర్యటిస్తారు.జూలై 14 (శుక్రవారం), 269 మంది సభ్యులతో కూడిన భారతీయ త్రి-సేవా దళం పాల్గొనే వార్షిక బాస్టిల్ డే పరేడ్‌లో ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరవుతారు
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) స్వీప్ చేసింది, గ్రామీణ స్థానిక ప్రభుత్వంలోని మూడు అంచెల్లోనూ మెజారిటీ సాధించింది. 3,317 గ్రామ పంచాయతీల్లో 2,552, 232 పంచాయతీ సమితులు, 20 జిల్లా పరిషత్‌లను గెలుచుకుంది. 212 గ్రామ పంచాయితీలు, 7 పంచాయితీ సమితుల్లో గెలుపొంది బీజేూపీ రెండవ స్థానంలో ఉంది. కొన్ని ఫలితాలు ఇంకా వెలువడవలసి ఉంది.
దేశరాజధాని ఢిల్లీలో 24 గంటల్లో రికార్డు స్దాయిలో 153 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీనితో ఢిల్లీలో 41 ఏళ్లలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 1982 తర్వాత జులైలో ఒక్కరోజులో ఇదే అత్యధిక వర్షపాతం అని భారత వాతావరణ శాఖ తెలిపింది.
కాంగ్రెస్‌కు అవినీతి అతిపెద్ద సిద్ధాంతమని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అవినీతికి కాంగ్రెస్ గ్యారెంటీ అయితే, తాను అవినీతిపై చర్యలకు గ్యారెంటీ అని మోదీ అన్నారు.శుక్రవారం ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రం కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందని అన్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారం అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా బల్తాల్ మరియు పహల్గాం మార్గాల్లో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఆరోగ్య మౌలిక సదుపాయాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రజల కోసం కేంద్ర సాయుధ పోలీసు బలగాల (CAPF) ఆసుపత్రులను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
దేశవ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలనంటుతున్నాయి. దీనితో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో కిలో రూ. 155 గా ఉంది. నివేదికల ప్రకారం, ఉత్పత్తి చేసే ప్రాంతంలో వర్షం కారణంగా సరఫరాలో అంతరాయం కారణంగా కూరగాయల ధర పెరిగింది.
మహారాష్ట్ర కొత్త ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల తర్వాత, రాష్ట్ర సచివాలయం సమీపంలో కొత్త ఎన్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అజిత్ పవార్ సిద్ధమయ్యారు. అయితే తాళం చెవి కనిపించకుండా పోవడంతో అజిత్ పవార్ వర్గానికి చెందిన నేతలు ఆగిపోయారు.