Home / Latest Nartional News
మహారాష్ట్రలోని ధులే జిల్లాలో మంగళవారం హైవేపై ఉన్న హోటల్లోకి ట్రక్కు దూసుకెళ్లడంతో 10 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.రాష్ట్ర రాజధాని ముంబయ్ కి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధులేలోని ముంబై-ఆగ్రా హైవేపై పలాస్నేర్ గ్రామ సమీపంలో ఉదయం 10.45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.
త్వరలో కొత్త విద్యుత్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. దీని ప్రకారం పగటిపూట విద్యుత్ ఛార్జీలు 20 శాతం వరకు తగ్గనున్నాయి. అయితే రాత్రిపూట పీక్ వేళల్లో విద్యుత్ ఛార్జీలను 20 శాతం మేర పెంచనున్నారు. దీనికి సంబంధించిన కొత్త విద్యుత్ నియమాలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది.
గుజరాత్, మహారాష్ట్ర మరియు డామన్‌లలో దోపిడీ, హత్య మరియు మద్యం అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై దాడి చేసిన తరువాత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం రూ. 1.62 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ జానకిరామన్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్‌గా కేంద్రం మంగళవారంనాడు నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు లేదా తదితర ఉత్వర్వులు వెలువడేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
భారత రీసెర్చ్ అండ్ అనలసిస్ వింగ్ అధిపతిగా ఐపిఎస్ అధికారి రవి సిన్హాని నియమించారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత రా చీఫ్ సామంత్ గోయల్ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. ఆ తరువాత రవిసిన్హా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
బిపర్ జోయ్ తుఫాను రాజస్థాన్‌లోని నాలుగు జిల్లాలను తాకడంతో ఆదివారం నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా అజ్మీర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రిలోకి వరదనీరు చేరింది.ఆసుపత్రిలో నీరు నిలిచిపోవడంతో సిబ్బంది తమ విధులను నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయడం రాష్ట్రంలోని అధికార డిఎంకె, బిజెపి మరియు ఎఐడిఎంకె, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది మంత్రికి ఛాతి నొప్పి రావడంతో బుధవారం ఉదయం వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. మనీలాండరింగ్ కేసులో బాలాజీని అరెస్ట్ చేశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించిన 17 ఏళ్ల రెజ్లర్ తండ్రి బుధవారం మాటమార్చారు. బ్రిజ్ భూషణ్ పై తాము కోపంతోనే ఇంత తీవ్రమైన ఆరోపణలు చేశామని చెప్పారు. తాము కోర్టులో చేసిన ప్రకటనను ఇప్పుడే మార్చామని మరియు కేసును ఉపసంహరించుకోలేదని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాకు చెందిన రెండు నివాసాలపై పోలీసులు దాడిచేసి భారీ మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఛేదించారు. అక్కడ అధిక నాణ్యత గల డ్రగ్ ను తయారు చేసి విదేశాలకు రవాణా చేయడానికి ముంబై మరియు కోల్‌కతాలోని ఓడరేవులకు పంపినట్లు వారు తెలిపారు.
ఇంటి గొడవల కారణంగా తన కుమార్తెను కత్తితో కనీసం 25 సార్లు పొడిచి చంపి, భార్యను గాయపరిచినందుకు సూరత్‌కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు.మే 18వ తేదీ రాత్రి సూరత్‌లోని కడోదర ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.