Last Updated:

Tomato prices: చుక్కలనంటుతున్న టమాటా ధరలు.. సిలిగురిలో కిలో రూ.155

దేశవ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలనంటుతున్నాయి. దీనితో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో  కిలో రూ. 155 గా ఉంది. నివేదికల ప్రకారం, ఉత్పత్తి చేసే ప్రాంతంలో వర్షం కారణంగా సరఫరాలో అంతరాయం కారణంగా కూరగాయల ధర పెరిగింది.

Tomato prices: చుక్కలనంటుతున్న టమాటా ధరలు.. సిలిగురిలో కిలో రూ.155

Tomato prices: దేశవ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలనంటుతున్నాయి. దీనితో వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో  కిలో రూ. 155 గా ఉంది. నివేదికల ప్రకారం, ఉత్పత్తి చేసే ప్రాంతంలో వర్షం కారణంగా సరఫరాలో అంతరాయం కారణంగా కూరగాయల ధర పెరిగింది.

మెట్రో నగరాల్లో..(Tomato prices)

మెట్రోలలో, రిటైల్ టమాటా ధరలు కిలోకు రూ. 58-148 శ్రేణిలో ఉన్నాయి, కోల్‌కతాలో అత్యధికంగా రూ. 148 మరియు ముంబైలో అత్యల్పంగా కిలోకు రూ. 58 ఉంది. ఢిల్లీ, చెన్నైలలో కిలో ధరలు వరుసగా రూ.110, కిలో 117గా ఉన్నాయి. ఒడిశాలో కిలో ధర రూ.100గా నిర్ణయించారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో కిలోకు అత్యధికంగా రూ. 155గా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన డేటా వెల్లడించింది.

దేశ రాజధాని ఢిల్లీలో, స్థానిక విక్రేతలు నాణ్యత మరియు స్థానికతను బట్టి కిలోకు 120-140 రూపాయల శ్రేణిలో విక్రయిస్తున్నారు. రాంచీ, జార్ఖండ్‌లో కూడా అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్ని చోట్లా టమాటా ధరలు పెరిగాయి.. ప్రస్తుతం టమాటా కంటే పెట్రోల్‌ చౌకగా ఉందని అని రాంచీకి చెందిన ఓ కస్టమర్‌ తెలిపారు. మరోవైపు య టమాటా వినియోగదారులను ఆదుకోవడానికి ఏపీ, తమిళనాడు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. రైతు బజార్లు, మార్కెట్ యార్డుల వద్ద కిలో రూ.50కే టమాటా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాయి.