Home / Latest Internatiional News
చైనా ప్రపంచంలోని పలు పేద దేశాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి వాటిని తన గుప్పెట్లో పెట్టుకుంటోంది. ప్రస్తుతం చైనా రుణాలు ఇచ్చిన సుమారు డజనుకు పైగా దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. డిఫాల్ట్ కావడానికి సిద్దంగా ఉన్నాయి.
పాకిస్తాన్ సుప్రీం కోర్టు న్యాయమూర్తుల వేతనాలు అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, మంత్రులు, సమాఖ్య కార్యదర్శులు మరియు పార్లమెంటేరియన్ల కంటే ఎక్కువగా ఉన్నాయని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సమర్పించిన నివేదిక వెల్లడించింది.
భారీ వర్షాలకు ఉత్తర ఇటలీలో నదులు పొంగిపొర్లి పట్టణాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. వునా నది పొంగిపొర్లడంతో ఉత్తర క్రొయేషియాలోని కొంత భాగంతో పాటు వాయువ్య బోస్నియాలోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో అక్కడి అధికారులు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఇస్లామాబాద్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అల్ ఖదీర్ ట్రస్టు కేసులో ఖాన్‌కు రెండు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. మంగళవారం నాడు ఇదే ఇస్లామాబాద్ హైకోర్టు ప్రాంగణం నుంచే ఖాన్ ను నేషనల్ అకౌంటబిలిటి బ్యూరో బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లింది.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వివాదాస్పద తోషాఖానా కేసులో ఊరట లభించింది. ఈ అంశాన్ని విచారించిన ఇస్లామాబాద్ హైకోర్టు దీనిపై స్టే విధించింది.. కోర్టు తన తీర్పును వెలువరిస్తూ, తోషఖానా కేసుకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ పై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై నిలుపుదల ఉత్తర్వు జారీ చేసింది
పోప్ ఫ్రాన్సిస్ ఒక దశాబ్దం క్రితం తాను బ్యూనస్ ఎయిర్స్ ఆర్చ్ బిషప్‌గా ఉన్నప్పుడు, అర్జెంటీనా ప్రభుత్వం తన తల నరికివేయాలని కోరుకుందని చెప్పారు.పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 29న హంగేరీని సందర్శించినప్పుడు జెస్యూట్‌లతో ఒక ప్రైవేట్ సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచ ప్రసూతి మరణాలు, ప్రసవాలు మరియు నవజాత శిశువుల మరణాలలో 60 శాతం మరియు ప్రపంచవ్యాప్తంగా 51 శాతం సజీవ జననాలకు కారణమయ్యే 10 దేశాల జాబితాలో భారతదేశం ముందుంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల అరెస్టు చేసారు. అల్-ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్‌ను అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ) అక్బర్ నాసిర్ ఖాన్ పేర్కొన్నట్లు ఇస్లామాబాద్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
అమెరికా లోని టెక్సాస్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. టెక్సాస్ నగరంలోని బ్రౌన్స్‌విల్లేలో ఈ ఘటన చోటు చేసుకుంది.
:ప్రస్తుతం పాకిస్తాన్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయింది. వచ్చే నెల 30వ తేదీ నాటికి 3.7 బిలియన్ డాలర్ల విదేశీ రుణాలు చెల్లించాల్సి ఉందని బ్లూమ్‌బర్గ్ శుక్రవారం నాడు విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది