Home / Latest Internatiional News
కెనడాలో భాతర సంతతికి చెందిన గ్యాంగ్‌స్టర్‌ను ఓ వెడ్డింగ్ రిసెప్షన్లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన వాంకోవర్ సిటీలో జరిగింది. గ్యాంగ్ వార్ వల్లే ఈ కాల్పుల ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఏకాంతంగా సమావేశం అయిన తర్వాత బెలారస్ అధ్యక్షుడు లుకషాన్కో ను హుటాహుటిన ఆయనను ఆసుపత్రికి తరలించినట్లు, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ జన్మించిన ఆస్ట్రియాలోని ఇంటిని పోలీసు అధికారులకు మానవ హక్కుల శిక్షణా కేంద్రంగా మార్చనున్నట్లు ఆస్ట్రియా అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది.
ఉక్రెయిన్‌కు అమెరికా తయారు చేసిన ఎఫ్-16 ఫైటర్ జెట్లను అందించడం ద్వారా నిప్పుతో చెలగాటమాడుతున్నారని రష్యా ఆదివారం పశ్చిమ దేశాలకు గట్టి హెచ్చరిక చేసింది.రష్యన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు
జీ దౌత్యవేత్త మరియు అమెరికా అధ్యక్ష సలహాదారు హెన్రీ కిస్సింజర్ శనివారం తన 100వ పుట్టినరోజును జరుపుకున్నారు.కమ్యూనిస్ట్ చైనాకు తలుపులు తెరవడం నుండి వియత్నాం యుద్ధానికి ముగింపు పలకడం వరకు సోవియట్ వ్యతిరేక నియంతలకు నిరంకుశంగా మద్దతు ఇవ్వడం వరకు, కిస్సింజర్ అతనికి ముందు లేదా తరువాత వారికంటే ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉన్నారు.
దక్షిణ కొరియాలో ఏషియానా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమాన డోర్‌ను ఓ ప్యాసింజెర్ తెరిచాడు. దీనితో విమానం లోపల భారీ గాలి ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో విమానంలో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. సిబ్బంది విమానాన్ని డేగూ విమానాశ్రయంలో దించారు.
18వ శతాబ్దపు మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ బెడ్‌చాంబర్ ఖడ్గం లండన్‌లోని బోన్హామ్స్ ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్ట్ సేల్ అనే వేలం హౌస్‌లో 14 మిలియన్ పౌండ్లకు ($17.4 మిలియన్లు లేదా రూ. 143 కోట్లు) విక్రయించబడింది. భారతీయ వస్తువుకు వేలంలో ఇది కొత్త ప్రపంచ రికార్డు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం సిడ్నీలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనం వంటి పలు రంగాల్లో సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఫిజీ దేశ అత్యున్నత పురస్కారం లభించింది. ప్రధాని మోదీ ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా "ది కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీతో సత్కరించారు.దీనిని ఫిజీ అధ్యక్షుడు సితివేని రబుకా ప్రధాని మోదీకి అందించారు
ఎల్ సాల్వడార్ స్టేడియంలో స్థానిక టోర్నమెంట్‌ను చూసేందుకు ఫుట్‌బాల్ అభిమానులు గుమిగూడిన సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారని పోలీసులు తెలిపారు.