Home / Latest Internatiional News
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వివరాలను విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా సోమవారం ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరియు ప్రథమ మహిళ జిల్ బైడెన్ల ఆహ్వానం మేరకు, ప్రధాని జూన్ 21 నుండి 23 వరకు యుఎస్‌లో పర్యటించనున్నారని క్వాత్రా పేర్కొన్నారు.
గ్రీస్ కోస్ట్‌గార్డ్ బుధవారం తెల్లవారుజామున పెలోపొన్నీస్‌లో పడవ బోల్తా పడి మునిగిపోవడంతో 59 మంది మరణించారని, మరో 100 మందిని రక్షించామని చెప్పారు. అయోనియన్ సముద్రంలో అంతర్జాతీయ జలాల్లో ఈ ప్రమాదం సంభవించింది.
ఆత్మహత్యలను నిషేధించాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దక్షిణ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అంచనా వేసిన దాని ప్రకారం ఉత్తర కొరియాలో అంతకుముందు సంవత్సరం కంటే ఆత్మహత్యలు దాదాపు 40 శాతం పెరిగాయి.
పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా అనేక ఇళ్లు కూలిపోవడంతో కనీసం 25 మంది మరణించగా 145 మంది గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బన్నూ, లక్కీ మార్వాట్ మరియు కరక్ జిల్లాల్లో వర్షాలు కారణంగా చెట్లుు, ఎలక్ట్రికల్ ట్రాన్స్మిటర్స్ టవర్స్ నేలకూలాయి.
విదేశాల్లో నివాసం ఉంటున్న ప్రవాసుల కోసం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల ర్యాంకులను ఈసీఏ ఇంటర్నేషనల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్ 2023ని విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్‌లో న్యూయార్కు అగ్రస్థానంలో నిలిచింది.
ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో ఎయిరిండియా విమానం ఇంజిన్‌లో లోపం కారణంగా రష్యాలోని మగదాన్‌కు దారి మళ్లించారు. ఎయిర్ ఇండియా అధికారి తెలిపిన వివరాల ప్రకారం విమానం రష్యాలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారని ఒక అధికారి తెలిపారు.
హైతీలో వారాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగావిస్తృతంగా వరదలు పోటెత్తడం, కొండచరియలు విరిగిపడటంతో 15 మంది మరణించారు. ఎనిమిది మంది తప్పిపోయారు. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో పలువురు నిరాశ్రయులయ్యారు.
ఆదివారం నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడటంతో పద్నాలుగు మంది మరణించారు మరియు ఐదుగురు తప్పిపోయినట్లు స్థానిక ప్రభుత్వం తెలిపింది.లెషాన్ నగరానికి సమీపంలోని జిన్‌కౌహేలోని ప్రభుత్వ యాజమాన్యంలోని అటవీ స్టేషన్లో ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అని స్థానిక ప్రభుత్వం ఆన్లైన్ ప్రకటనలో తెలిపింది.
కోవిడ్ -19 కేసులు తగ్గుతున్నప్పటికీ, హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ లేదా HMPV అని పిలువబడే మరొక శ్వాసకోశ వైరస్ యునైటెడ్ స్టేట్స్ అంతటా వ్యాపిస్తోంది.సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) గత వారం దేశవ్యాప్తంగా HMPV కేసులలో పెరుగుదలను నివేదించింది.
2019లో నార్వేలో తిరిగిన బెలూగా తిమింగలం స్వీడన్ తీరంలో మళ్లీ కనిపించింది.ఇది రష్యన్ నావికాదళం ద్వారా శిక్షణ పొందిన గూఢచారి అని ఊహాగానాలకు దారితీసింది, మానవ నిర్మిత జీను కారణంగా తిమింగలం రష్యా నావికాదళం ద్వారా శిక్షణ పొందిందని ఊహాగానాలు చెలరేగాయి.