Home / Latest Internatiional News
మెదడు లోపల అరుదైన రక్తనాళాల అసాధారణతకు చికిత్స చేయడానికి గర్భంలో ఉన్న శిశువుకు అమెరికన్ వైద్యుల బృందం సంచలనాత్మక మెదడు శస్త్రచికిత్సను నిర్వహించింది.ఈ అరుదైన మెదడు పరిస్థితిని "వీనస్ ఆఫ్ గాలెన్ వైకల్యం" అని పిలుస్తారు. ఈ ఆపరేషన్ బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో నిర్వహించబడింది.
సెర్బియాలో 21 ఏళ్ల యువకుడు జరిపిన కాల్పుల్లో 8 మంది మరణించగా 10 మంది గాయపడ్డారు. దేశంలో రెండురోజుల్లో ఇది ఈ తరహా రెండవ సంఘటన కావడం విశేషం. రెండురోజులకిందట బెల్ గ్రేడ్ పాఠశాలలో 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో 8 మంది విద్యార్దులతో సహా సెక్యూరిటీ గార్డు మరఠణించిన విషయం తెలిసిందే.
పుతిన్‌పై ఉక్రెయిన్ హత్యాయత్నం చేసిందని ఆరోపించిన వెంటనే దాడుల జోరును పెంచింది. దీంతో రెండు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. రెండు దేశాలూ పోటాపోటీగా బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి.
ప్రస్తుతం ఆసియాలో ద్రవ్యోల్బణం శరవేగంగా పెరుగుతున్న దేశాల్లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే శ్రీలంకను కూడా మించిపోయింది. దీనికి ప్రధాన కారణం డాలర మారకంతో స్థానిక కరెన్సీ బలహీనపడ్డంతో పాటు ఆహారం, ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దాని ప్రభావం ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణంపై పడింది.
వరైనా ఆకలితో ఉన్నప్పుడు, వారు సులభంగా లభించే ఏదైనా తినడానికి సిద్ధంగా ఉంటారు. ఎక్కువ కాలం ఆహారం లభించనందున పచ్చి మాంసం తినే వ్యక్తులు కూడా ఉన్నారు. అయితే సియోల్ విద్యార్థి తన ఆకలి బాధలను కొంచెం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది
కింగ్ చార్లెస్ III పట్టాభిషేకం శనివారం, మే 6న జరగనుంది. కింగ్ చార్లెస్ గత ఏడాది సెప్టెంబర్ 2022లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్ IIమరణం తర్వాత సింహాసనాన్ని అధిష్టించారు.. పట్టాభిషేక వారాంతంలో ఊరేగింపులతో సహా దేశవ్యాప్త వేడుకలు నిర్వహించబడతాయి.
స్పెర్మ్ డొనేషన్ల ద్వారా 500 నుండి 600 మంది పిల్లలకు తండ్రయిన వ్యక్తిని డచ్ న్యాయమూర్తులు దానం చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. జోనాథన్ (41)గా గుర్తించబడిన వ్యక్తి మళ్లీ విరాళం ఇవ్వడానికి ప్రయత్నిస్తే రూ. 90,41,657 జరిమానా విధిస్తామని చెప్పారు.
ఆపరేషన్ కావేరి కింద న్యూఢిల్లీలో అడుగుపెట్టిన భారతీయులు, భారత సైన్యం యొక్క ప్రయత్నాలను మరియు ప్రభుత్వ ఏర్పాట్లను ప్రశంసించారు.ఢిల్లీ విమానాశ్రయం వెలుపల నిర్వాసితులైన వారు దేశాన్ని, సైన్యాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని కీర్తిస్తూ నినాదాలు చేశారు.
అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే తుంటరి పనులకు కేరాఫ్ అడ్రస్. ఆయన వ్యాఖ్యలే కాదు.. చేసే పనులు కూడా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాయి.
ఉక్రెయిన్‌తో యుద్ధం ఉన్నప్పటికీ రష్యాలోని అత్యంత సంపన్నుల సంపద గత ఏడాది కాలంలో 152 బిలియన్ డాలర్లు పెరిగిందని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం, సహజ వనరులకు పెరిగిన ధరల కారణంగా బిలియనీర్ల సంఖ్య సంపద పెరిగింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన వెంటనే వారు అదృష్టవంతులయ్యారు.