Home / latest ap news
టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదివరకు వైఎస్సార్ హయాంలో 2006-2008 మధ్య టీటీడీ ఛైర్మన్‌గా భూమన పని చేశారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా భూమన ఉన్నారు. ఈ నెల 8వ తేదీతో వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ముగియనుంది. టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉందన్నారు.
అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం అంగళ్లు కూడలిలో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు రోడ్ షోను సందర్భంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండపడ్డారు. చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పోలవరాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారని మంత్రి అంబటి ప్రశ్నించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత షెడ్యూల్ ఖరారైంది. ఆగస్టు 10వ తేదీ నుంచి విశాఖ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. యాత్రలో భాగంగా 6 ఫీల్డ్ విజిట్స్ , 2 బహిరంగ సభలు, ఒక జనవాణి కార్యక్రమం నిర్వహించనున్నారు.
తన క్యారెక్టర్ పెట్టి అవమానించారంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ తాజా సినిమా బ్రోపై మండిపడుతున్న ఏపీ మంత్రి అంబటి రాంబాబు కసితో రగిలిపోతున్నారు. బ్రో సినిమా ద్వారా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్‌కి ప్యాకేజి ఇచ్చారంటూ అంబటి ఆరోపిస్తున్నారు. బ్రో నిర్మాతకి అక్రమంగా డబ్బులు వచ్చాయని, ఆ నిర్మాత ద్వారా టిడిపి పవన్ కళ్యాణ్‌కి డబ్బులిచ్చిందని అంబటి చెబుతున్నారు.
రైల్వే సాంకేతిక విభాగంలో ఉద్యోగాల కోసం అన్ని అర్హతలు కలిగిన యువతకు నియామకాలు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచడం దారుణమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సీసీఎఎ అర్హత సాధించిన వారు తెలుగు రాష్ట్రాల్లో 400మందిని పెండింగులో ఉంచారని తెలిపారు.
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఇక నందిని నెయ్యిని వినియోగించరు. దీనితో 50 ఏళ్ల బంధానికి బ్రేక్ పడింది. తిరుమల లడ్డూల తయారీకి వాడే నెయ్యిని తక్కువ ధరకు అందించే మరో కంపెనీకి టీటీడీ టెండర్ ఖరారు చేసింది. దీనిపై కర్ణాటకలో రాజకీయ దుమారం రేగింది.
నువ్వు నాతో ఉన్నప్పుడు నాకెవరూ వద్దనిపిస్తోంది.. కానీ నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తోంది.. ఈ మాటలు ఎవరో భగ్న ప్రేమికుడు తన ప్రేయసి కోసం చేపప్దు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.. 16 ఏళ్ల తెలిసి తెలియని వయసులో ఓ విద్యార్ధి.. ఆకర్షణకి లోనయ్యి.. చివరికి తన ప్రాణాలనే తీసుకోవడం ఇప్పుడు
విశాఖపట్నంలో ఓ యువతి వీరంగం సృష్టించింది. మద్యం మత్తులో మంగళవారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించింది. స్థానిక వీఐపీ రోడ్డులో ఇన్నోవా కారును నడుపుతున్న ఆమె అతి వేగంతో ఇతర వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెతోపాటు కారులో ప్రయాణిస్తున్న