Minister Ambati Rambabu: చంద్రబాబు స్దాయి దిగజారి మాట్లాడుతున్నారు.. మంత్రి అంబటి రాంబాబు
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండపడ్డారు. చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పోలవరాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారని మంత్రి అంబటి ప్రశ్నించారు.

Minister Ambati Rambabu: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండపడ్డారు. చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పోలవరాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారని మంత్రి అంబటి ప్రశ్నించారు.
ఇరిగేషన్ గురించి మాటలు ఆడకుండా బ్రో సినిమా గురించి మాట్లాడుతున్నారు. ఆంబోతు రాంబాబు అంటున్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి 9 ఏళ్లు పోలవరం గురించి ఎందుకు పట్టించుకోలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అసలు పోలవరానికి శంకుస్దాపనచేసి పనులు వేగంగా ప్రారంభం చేసింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ద్యం పెంచింది కూడా వైఎస్సే అన్నారు. కేంద్రమే పోలవరం కడతాము అంటే టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రణాళికా బద్దంగా చేయకుండా వరదలు వస్తే ఇబ్బంది పడేలా చేసింది చంద్రబాబే నన్నారు. రాయలసీమ లో మీ కాలం లో ఏ ప్రాజెక్ట్ కు అయిన శంకుస్థాపన చేసారా? ప్రాజెక్ట్ ను ప్రారంభం చేశారా? అని అంబటి చంద్రబాబును ప్రశ్నించారు.ఢిల్లీ టూర్ లో భాగం గా నీటి పారుదల శాఖామంత్రి గజేంద్ర సింగ్ షేకవత్ ను కలిశాను.పోలవరం చూడడానికి రావడానికి ఆహ్వానించాను. మంత్రి కూడా వస్తానని చెప్పారని తెలిపారు.
పవన్ కళ్యాణ్ మమ్నల్ని గోకాడు..( Minister Ambati Rambabu)
పవన్ కళ్యాణ్ మమ్మల్ని గోకాడు కాబట్టి బ్రో సినిమాపై మాట్లాడుతున్నామని అంబటి రాంబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ కు నిజంగా నిజాయితీ ఉంటే బ్రో సినిమాకి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో చెప్పాలి.ఇచ్చిన నిర్మాతని కూడా అడుగుతున్నా చెప్పాలని డిమాండ్ చేసారు. పవన్ కళ్యాణ్ ఓ సారి కమ్యునిస్ట్ అని, మరోసారి చేగువేరా అంటారని నీతి నిజాయితీ మాటల వరకే కాని ఆయన చేతల్లో వుండవని అన్నారు.బ్రో సినిమాపై మేము మాట్లాడితే చంద్రబాబు కి ఎందుకు కోపం వచ్చిందని అన్నారు. తనపై జనసెన తీస్తున్న SSS ( సందులో సరదాల శ్యామ్ బాబు ) సినిమాపై మాట్లాడుతూ అందులో పవన్ కళ్యాణ్ కూడా నటించాలని ఏమైనా సహాయం కావాలంటే చేస్తామంటూ అంబటి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- Haryana clashes: హర్యానా ఘర్షణలు: నుహ్ మరియు ఇతర ప్రదేశాలలో 3 గంటల పాటు మొబైల్, ఇంటర్నెట్ సేవలు పునరుద్దరణ
- Gnanavapi Masjid survey: జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి