Home / latest ap news
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో విజయవాడ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నాయకులు పార్టీలు మారుతున్నారు. తాజాగా అధికార వైసీపీ విజయవాడ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన టీడీపీలో చేరనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాశారు. ఈ లేఖలో జనసేన గెలిచే నియోజకవర్గాలు, అక్కడ ఎవరిని నిలబెడితే బాగుంటుందో సూచించారు. తిరుపతి నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని తెలిపారు.
ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం రాత్రి ఉండవల్లిలోని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ డిన్నర్ చేయనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోతోపాటు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. సోమవారం టీడీపీ-జనసేన కూటమి తొలి జాబితాని విడుదల చేసే అవకాశాలున్నాయి.
ఏపీలో అధికార వైసీపీ పార్టీకీ మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేశారు. త్వరలో జనసేనలో చేరుతున్నానని బాలశౌరి ట్వీట్ చేశారు. కొద్ది రోజులుగా తనకి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బాలశౌరి మనస్తాపంతో ఉన్నారు.
రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్‌తో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన భేటీ వివరాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. జనసేన బలంగా ఉన్న చోట్ల కనీసం 40 స్థానాలకి తగ్గకుండా చూడాలని పవన్ కళ్యాణ్‌ని కోరానని జోగయ్య వెల్లడించారు.
తిరుపతిలో మాజీ ఎంపీ చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి కాంగ్రెస్ తరపున తిరుపతి నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. ఆయన గెలిస్తే ముఖ్యమంత్రిని చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్‌కు 130 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు సీట్లు వస్తాయని ఆయన అన్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ నేత షర్మిల కలిశారు. ఈ నెల 18న తన కుమారుడు రాజారెడ్డి- అట్లూరి ప్రియ ఎంగేజ్మెంట్కి, ఫిబ్రవరి 17న జరుగబోయే ఎంగేజ్మెంట్కి రావాలని చంద్రబాబు నాయుడిని వైఎస్ షర్మిల ఆహ్వానించారు. చంద్రబాబు షర్మిలను సాదరంగా ఆహ్వానించారు. తప్పకుండా వివాహానికి హాజరవుతానని చెప్పారు.
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అస్సాంవాసులు తిరుమలలోని మోకాళ్ళ పర్వతంపై డ్రోన్‌తో వీడియో తీశారు. మోకాళ్ళ పర్వత ప్రాంతం, ఘాట్ రోడ్డులను అస్సాం వాసులు షూట్ చేశారు.అస్సాంకు చెందిన దంపతులిద్దరూ కారులో మోకాళ్ళ పర్వతంపైకి వచ్చి డ్రోన్‌ను వినియోగించారు.
అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పులో భాగంగా మూడో జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఆరు పార్లమెంట్ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 21 మంది ఇన్‌ఛార్జిల పేర్లను ప్రకటించింది. తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను వెల్లడించారు.