Home / latest ap news
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 1987 బ్యాచ్‌కు చెందిన ఆయన.. ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిని సెలవుపై వెళ్లాల్సిందిగా చంద్రబాబు ఆదేశించడం జరిగిందని తెలుస్తోంది .ఇక, సాయంత్రంలోగా కొత్త సీఎస్ నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.1992 బ్యాచ్ కు చెందిన విజయానంద్ ను సీఎస్ గా చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం .
గరిలో రోజాకు మొదటి నుంచి ఇంటి పోరు ఇబ్బంది పెట్టింది . నగిరి నుంచి రోజా ఓడిపోవడంతో వైసీపీలోనే ఓ వర్గం సంబరం చేసుకుంటోంది. రోజా ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందంటూ సొంత పార్టీలోని వర్గమే వీడియో రిలీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రైమ్ 9 సీఈవో పైడికొండల వెంకటేశ్వరరావు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్దిగా పొటీచేసి గెలిచిన నాదెండ్ల మనోహర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనులు తెలిపారు. ఈ సందర్బంగా తాజా రాజకీయపరిణామాలపై చర్చించారు.
ఏపీలో ఇప్పుడు ఎవరు మంత్రివర్గంలో స్థానం దక్కించుకుంటారనే చర్చ బాగా జరుగుతోంది . 164 స్థానాలు గెలుచుకుని భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి. మొత్తం 26 మంత్రి పదవులు ఉంటాయి .
ఏపీలో ప్రభుత్వం మారనుండడంతో కీలక పైళ్ల పై రాబోయే ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది .తెలంగాణ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు సీఐడీ అధికారులకు ఇప్పటికే సూచనలు ఇచ్చినట్లుంది .
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయదుందుభి సాధించిన టీడీపీ ఫుల్ జోష్‌లో ఉంది. అలాగే లోకసభ ఎన్నికల్లో టీడీపీ 16 సీట్లు సాధించింది. ప్రస్తుతం బాబు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసన సభ , పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంతో ఇప్పటి వరుకు ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన అధికారులు రాజీనామా లు చేసే పనిలో పడ్డారు .కొంత మంది సెలవలు పెడుతున్నారు .
ఇంతకాలం గ్లాస్ గుర్తు పై వివాదం నెలకొంది .2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల సంఘం గుర్తింపు పొందే స్థాయిలో విజయం సాధించలేదు .దింతో గాజు గ్లాస్ గుర్తు జనరల్ కేటగిరీ లో ఉంచింది ఎన్నికల సంఘం .
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఎన్డీయే సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. సమావేశంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు.