Home / latest ap news
ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం చంద్రబాబుకు వచ్చిందని మాజీ పార్లమెంటు సభ్యుడు అరుణ్ కుమార్ అన్నారు.శుక్ర వారం ఆయన మీడియాతో మాట్లాుతూ ఏపీ ఫలితాలతోనే మోదీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిందన్నారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న రాజకీయ హింసపై పలువురు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి డీజీపీ కి ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో కొత్తగా కొలువు దీరిన మంత్రలుకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రకటన విడుదల చేశారు. పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. వీటి్కి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఐదేళ్లు ఎదురు లేని పాలన,తిరుగులేని విజయాలు, తనమాటే శాసనం ,తాను తలచినదే చట్టం అన్న రీతిలో కొనసాగిన జగన్ పరిపాలనకు ఆంధ్ర జనం మంగళం పాడింది తెలిసిందే .అతి దారుణ ఓటమి చవిచూసిన జగన్ ఇప్పుడు అసెంబ్లీ కి వస్తాడా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న .
కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వానికి తాము ఇచ్చిన ముఖ్యమైన హామీలపై ముఖ్య మంత్రి తొలి సంతకం చేయడం అనేది వైఎస్ తో ప్రారంభమైందని చెప్పొచ్చు . 2004 లో వైఎస్ ఉచిత విద్యుత్ ఫైల్ పై తొలి సంతకం చేసారు .
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సెక్రటేరియట్లో నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు మెగా డీఎస్సీపైన తొలి సంతకం చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు.. ఇచ్చిన మాట మేరకు అదే ఫైల్ పైన తొలి సంతకం చేశారు.
రాజమండ్రి జైలు సాక్షిగా...జనసేన, టీడీపీ ఒక్కటై పొత్తు పెట్టుకున్నాయి. చివరకు ఆ పొత్తు ధర్మమే..ఏపీలో ధర్మాన్ని గెలిపించి అధర్మాన్ని పాతరేసింది. సీన్ కట్ చేస్తే ఏపీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది.
తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభమైందని..తిరుమల మొత్తాన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ నినాదం తప్ప వేరేది వినిపించకూడదని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు.
ఏపీలో నూతన ప్రభుత్వం ఏర్పడింది .ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీప్రమాణ స్వీకారం చేసారు